ఎన్టీఆర్ డ్రాగన్ టైటిల్ వెనుక ఇంత కథ నడిచిందా..

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:10 PM

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరో విన్న కథ మరో హీరో దగ్గరకు వెళ్తూ ఉంటాయి. చాలా రేర్ సమయాల్లో టైటిల్స్ కూడా ఒక హీరో నుంచి ఇంకో హీరోకి వెళ్తూ ఉంటాయి.

Dragon

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరో విన్న కథ మరో హీరో దగ్గరకు వెళ్తూ ఉంటాయి. చాలా రేర్ సమయాల్లో టైటిల్స్ కూడా ఒక హీరో నుంచి ఇంకో హీరోకి వెళ్తూ ఉంటాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా డ్రాగన్ (Dragon) టైటిల్ విషయంలో కూడా ఇదే జరిగిందంట. ఈ విషయాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) బయటపెట్టాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన అయాన్, రణ్‌బీర్ కపూర్ హీరోగా తాను తెరకెక్కించిన ఫాంటసీ చిత్రం బ్రహ్మాస్త్రకు మొదట డ్రాగన్ అనే టైటిల్‌నే అనుకున్నామని వెల్లడించారు. అయితే, కథ పరిధి పెరిగి ప్రాజెక్ట్ స్థాయి మారడంతో ఆ పేరును పక్కనపెట్టి బ్రహ్మాస్త్రగా మార్చినట్లు తెలిపాడు.


హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 చిత్రానికి దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ.. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాకు ఈ టైటిల్ ఎలా దక్కిందో వివరించాడు. ప్రశాంత్ నీల్ బృందం తమ సినిమా కోసం పవర్‌ఫుల్ టైటిల్ వెతుకుతున్న సమయంలో, కరణ్ జోహార్ వద్ద రిజిస్టర్ అయి ఉన్న డ్రాగన్ టైటిల్‌ను వారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. మొదట బ్రహ్మాస్త్ర సినిమాని చిన్న బడ్జెట్ తో మొదలుపెట్టామని, అది పెరిగిపెరిగి పాన్ ఇండియా స్థాయికి మారడంతో డ్రాగన్ టైటిల్ కరెక్ట్ కాదని అనిపించిందని అయాన్ తెలిపాడు. ఇక సమయంలో ఎన్టీఆర్ కోసం ఒక మంచి టైటిల్ వెతుకుతున్నారని తెలిసి కరణ్ జోహార్, తాను తమ దగ్గర ఉన్న డ్రాగన్ టైటిల్ ని ఇచ్చామని చెప్పుకొచ్చాడు.


అలా రణబీర్ కపూర్ సినిమా టైటిల్ ఎన్టీఆర్ వద్దకు చేరింది. ఏదిఏమైనా డ్రాగన్ అనేది ఎన్టీఆర్ కే కరెక్ట్ గా సరిపోయిందని నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ డ్రాగన్ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోండగా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది జూన్ 11 న వస్తోందని మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 24 , 2026 | 07:05 PM