Mukku Avinash: వాళ్ల కాళ్లు పట్టుకున్నాను.. రోడ్డుమీద పడి దొర్లాను

ABN , Publish Date - Jul 06 , 2026 | 07:02 PM

బయట అందరినీ నవ్వినక వారి వెనుక ఎంతో విషాదం దాగి ఉంటుంది. అలాంటి విషాదాలు ఎన్నో తమ గుండెల్లో దాచుకొని.. ప్రేక్షకులను నవ్విస్తున్నారు ఎంతోమంది కమెడియన్స్. అలాంటి కమెడియన్స్ లో ఒకడు అవినాష్ (Avinash).

Mukku Avinash

బయట అందరినీ నవ్వినక వారి వెనుక ఎంతో విషాదం దాగి ఉంటుంది. అలాంటి విషాదాలు ఎన్నో తమ గుండెల్లో దాచుకొని.. ప్రేక్షకులను నవ్విస్తున్నారు ఎంతోమంది కమెడియన్స్. అలాంటి కమెడియన్స్ లో ఒకడు అవినాష్ (Avinash). జబర్దస్త్ ద్వారా పరిచయమై మంచి గుర్తింపూ తెచ్చుకున్నాడు. తన ముక్కుపై జోకులు వేసి ముక్కు అవినాష్ గా మారాడు. ఇక బిగ్ బాస్ కి వెళ్లి మరింత గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.. ప్రస్తుతం వరుస షోస్, సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక అందరినీ నవ్వించే అవినాష్ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. అందులో ఒకటి.. అతని బిడ్డను కోల్పోవడం. అవినాష్ భార్య అనూజకి మొదటి బిడ్డ నిలవలేదు. ఎంతో ఆనందంతో వారు మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సీమంతం అయ్యి హాస్పిటల్ కి వెళ్ళేవరకు కూడా వారు ఆ ఆనందంతోనే ఉన్నారు. కానీ, ఒక్కసారిగా ఆ ఆనందం ఆవిరయ్యింది. ఆ సమయంలో వారు పడిన వేదన అంతా ఇంతా కాదు.


తాజాగా కాకమ్మ కథలు టాక్ షోలో అవినాష్.. ఆ బాధను వివరించాడు. నటి సునైనాతో కలిసి షోలో పాల్గొన్న అవినాష్.. షో మొత్తం తన కామెడీ పంచ్ లతో నవ్వించాడు. ఇక షోలో భాగంగా హోస్ట్ తేజస్వి మీ లైఫ్‌లో ఇప్పటివరకు జరిగిన అత్యంత బాధాకరమైన సంఘటన ఏంటి? అని అడగగా.. నేను నా మొదటి బిడ్డను కోల్పోయాను.. ఈ విషయం చాలా మందికి తెలియదు" అంటూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. ఒక తల్లిగా ఆ బాధను వర్ణించడం సాధ్యం కాదని, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉన్నాయని తెలిపింది. ఎన్నోసార్లు నన్ను కాపాడు అమ్మ అని అరుస్తున్నట్లు వినిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చింది.


ఇక అదే బాధ తాను పడ్డానని అవినాష్ చెప్పుకొచ్చాడు. ఒక తండ్రిగా ఆ బిడ్డను పోగొట్టుకున్నప్పుడు అనుభవించిన నరకం, ఆ చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ తన గుండెల్లో అలానే ఉన్నాయని అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. 'ఈ మధ్యకాలంలో నేను ఆ బాధను అనుభవించాను. హాస్పిటల్ లో డాక్టర్స్, నర్సులు కాళ్లు పట్టుకున్నాను. ఉప్పల్ లోని హాస్పిటల్ బయట రోడ్డు మీద మట్టిలో దొర్లాను. ఆ సమయంలో ఆహా వారు చాలా హెల్ప్ చేశారు. నాకోసం షూటింగ్ క్యాన్సిల్ చేశారు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Jul 06 , 2026 | 07:30 PM