Avika Gor: 32 ఏళ్ళ నటుడితో ఎఫైర్.. సీక్రెట్ గా బిడ్డను కని..
ABN , Publish Date - May 22 , 2026 | 09:03 PM
ఇండస్ట్రీ అన్నాకా రూమర్స్ సర్వసాధారణం. ముఖ్యంగా హీరోయిన్స్ మీద అయితే మరీ దారుణం. కొన్నిసార్లు హీరోయిన్లు వాటిపై స్పందిస్తారు. లేదు అంటే ఏదైనా ఇంటర్వ్యూలలో ఓపెన్ అవుతారు.
ఇండస్ట్రీ అన్నాకా రూమర్స్ సర్వసాధారణం. ముఖ్యంగా హీరోయిన్స్ మీద అయితే మరీ దారుణం. కొన్నిసార్లు హీరోయిన్లు వాటిపై స్పందిస్తారు. లేదు అంటే ఏదైనా ఇంటర్వ్యూలలో ఓపెన్ అవుతారు. తాజాగా హీరోయిన్ అవికా గోర్ (Avika Gor) అలాంటి ఒక షాకింగ్ రూమర్ గురించి చెప్పుకొచ్చింది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో బాలనటిగా అవికా ఇండస్ట్రీకి పరిచయమైంది. సీరియల్స్ చేస్తూ హీరోయిన్ గా మారింది. తెలుగులో ఉయ్యాలా జంపాల, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా లాంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
తాజాగా అవికా నటించిన అగ్లీ స్టోరీ ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకొంటుంది. నందు హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా.. తన జీవితంలో విన్న షాకింగ్ రూమర్ గురించి బయటపెట్టింది. అంతేకాకుండా అంత క్రియేటివ్ గా ఆ రూమర్ రాసినవారిని ప్రశంసలతో ముంచెత్తింది.
' నా 18 ఏళ్ళ వయస్సులో నాకు 32 ఏళ్ళ వయసున్న నటుడికి ఎఫైర్ ఉందని రూమర్ వచ్చింది. అంతేకాకుండా మా ఇద్దరికీ పెళ్ళి అయ్యిందని, బిడ్డను కూడా కన్నాను అని చెప్పారు. పెళ్ళి విషయాన్నీ, బిడ్డను కూడా దాచి ఉంచాను అని రాశారు. చాలా షాకింగ్ గా లేదు. అసలు ఆ బిడ్డ ఎవరు అనేది కాదు కదా .. అసలు ఆ నటుడితో నేను ఎప్పుడు ప్రేమలో పడ్డాను అనే విషయం కూడా నాకు తెలియదు. మేమిద్దరం కలిసి పని చేశాం.. ప్రేమలో పడ్డాం.. ఆ రూమర్ నాకు చాలా నచ్చింది. అసలు అంత క్రియేటివ్ గా ఆలోచించారు. ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు.. ఒక బిడ్డను దాచాం అని కూడా చెప్పారు. అసలు ఏ లెవెల్ లో రాశారు అంటే.. హ్యాట్సాఫ్. ఇలా రాసేవారు మూవీస్ చేయండి' అంటూ చెప్పింది. ప్రస్తుతం అవికా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.