ఉస్తాద్ భగత్‌సింగ్: ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ ప్రోమో వచ్చేసింది..
ABN, Publish Date - Feb 20 , 2026 | 04:07 PM
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh). శ్రీలీల, రాశీఖన్నా నాయికలు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh). శ్రీలీల, రాశీఖన్నా నాయికలు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రమోషన్స్ షురూ చేశారు. సినిమాకు సంబంధించి ఒక్కో విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ సాంగ్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సర్వం సిద్ధం చేశారు. ‘ఆరా ఆప్ ఉస్తాద్’ పేరుతో ఓ పాటను విడుదల చేయనున్నారు. (Aura Of Ustaad Song Promo)
దీనికి సంబంధించిన ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. ఫుల్ సాంగ్‌ను 22వ తేది ఆదివారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు హరీశ్ శంకర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘మళ్లీ లోడెడ్.. ఫుల్లీ లోడెడ్.. గేమ్‌ను డామినేట్ చేయడానికి మేం మళ్లీ వస్తున్నాం’ అంటూ మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీ ప్రసాద్‌లో స్టూడియోలో దిగిన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
Updated at - Feb 20 , 2026 | 04:42 PM