మెడ ముట్టుకుంటే.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పూన‌కాలే1 ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’.. పాట‌ వ‌చ్చేసింది

ABN , Publish Date - Feb 22 , 2026 | 08:35 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ నుంచి ఆరా ఆఫ్‌ ఉస్తాద్ లిరిక‌ల్ సాంగ్ వ‌చ్చేసింది.

Pawan Kalyan

ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan), హ‌రీశ్ శంక‌ర్ (Harish Shankar) కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (Ustaad Bhagat Singh). ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మ‌రో నెల రోజుల్లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సాంగ్, పోస్ట‌ర్లు, గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను ఆకాశానికి తీసుకెళ్లాయి.

కాగా తాజాగా ఆదివారం ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి ఈ చిత్రం నుంచి మెడ ముట్టుకుంటే.. తొడ కొట్టిన‌ట్లే, జుట్టు ఎగురుతుంటే.. ఇక ద‌డ ద‌డ పిడుగులు ప‌డిన‌ట్టే (Aura Of Ustaad Lyric Video) అంటూ ప‌వ‌న్ మేన‌రిజ‌మ్‌ను చూపుతూ ఉషారెత్తించేలా పాట సాగింది. ఈ పాట‌కు అస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ (Chandrabose) సాహిత్యం అందించ‌గా దేవీ శ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) స్వీయ‌ సంగీతంలో ఎస్పీ అభిషేక్ (S. P. ABHISHEK) తో క‌లిసి ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తోంది.

Updated Date - Feb 22 , 2026 | 08:35 PM