అల్లు అర్జున్-అట్లీ మూవీకి ఇంతమంది రచయితలా.. 

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:44 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్(Kollywood) సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్(Kalanithi Maran) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్(Kollywood) సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్(Kalanithi Maran) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె  కథానాయికగా నటిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) మందన్న ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న సరికొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు రమ్యకృష్ణ, జిమ్ సర్భ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, కేవలం ఇండియన్ సినిమాగానే కాకుండా  పాన్ -వరల్డ్ మూవీగా రూపుదిద్దుకుంటోంది. అల్లు అర్జున్ ఇమేజ్‌కు అట్లీ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఈ సినిమా కథాంశం ఒక సరికొత్త 'సూపర్ హీరో' కాన్సెప్ట్‌తో సాగనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, మన దేశీయ సంస్కృతి కలబోతగా ఈ కథను అట్లీ సిద్ధం చేశారు. ముఖ్యంగా 'సమాంతర ప్రపంచాలు' (Parallel Worlds), 'పునర్జన్మల' నేపథ్యంలో సాగే ఈ విభిన్నమైన పాయింట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని సినీ వర్గాల్లో టాక్. అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని విభిన్నమైన లుక్స్‌లో, సూపర్ హీరో అవతారంలో కనిపించబోతున్నారని సమాచారం.

కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సినిమాలో కామెడీ, ఎమోషన్స్‌కు అట్లీ పెద్దపీట వేస్తున్నారు. దీనికోసం టాలీవుడ్ కామెడీ కింగ్స్ అనిల్ రావిపూడి, శ్రీను వైట్ల టీమ్స్‌కు చెందిన రచయితలను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. వీరి సహకారంతో రాసిన హిలేరియస్ కామెడీ సీన్లను అల్లు అర్జున్, యోగి బాబులపై చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని చిత్రబృందం ధీమాగా ఉంది.

సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. ముఖ్యంగా ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఉంటాయని సమాచారం. ప్రస్తుతం #AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఒక పవర్‌ఫుల్ టైటిల్‌ను ఇప్పటికే మేకర్స్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా టైటిల్‌తో పాటు ఒక సాలిడ్ టీజర్‌ను విడుదల చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇది నిజంగానే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు ఒక 'మెగా ట్రీట్' అని చెప్పవచ్చు.

Updated Date - Feb 14 , 2026 | 03:44 PM