Sreeleela: 25 ఏళ్లకే.. ముగ్గురు పిల్లల తల్లి శ్రీలీల! రియ‌ల్ స్టోరి

ABN , Publish Date - Jan 09 , 2026 | 06:49 AM

యువ కథానాయిక శ్రీలీల (Sreeleela) 25 ఏళ్ల వయసులోనే ముగ్గురు పిల్లల తల్లి అయ్యారు. ఆమెకు పెళ్లి కాలేదు కదా అని కంగారు పడకండి.

Sreeleela

యువ కథానాయిక శ్రీలీల (Sreeleela) 25 ఏళ్ల వయసులోనే ముగ్గురు పిల్లల తల్లి అయ్యారు. ఆమెకు పెళ్లి కాలేదు కదా అని కంగారు పడకండి. వాళ్లు ఆమె సొంత పిల్లలు కాదు.. పెంచుకుంటున్న పిల్లలు. మూడేళ్ల కిత్రం ఓ అనాథ ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో వారిని పెంచి పోషిస్తోంది. ఆ పిల్లల పేర్లు ఏమిటో తెలుసా? గురు, శోభిత.

తాజాగా ఇప్పుడు మరో పాపను కూడా దత్తత తీసుకుంది శ్రీలీల. వృత్తిపరంగా తను బిజీగా ఉన్నప్పటికీ పిల్లల పెంపకంలో మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం వహించడం లేదు. 2019లో కన్నడ చిత్రం 'కిస్'లో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు నన్నొక పిల్లల అనాధాశ్రమా నికి తీసుకెళ్లారు.

అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేసింది. తరచూ అక్కడికి వెళ్లేదాన్ని. చాలా కాలం ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచాను. కానీ నాలాగా మరికొందరు చేస్తారనే ఆశతో ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తు న్నాను' అని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ‌య‌ట పెట్టింది శ్రీలీల. ఇది తెలుసుకున్న చాలామంది శ్రీలీల మ‌న‌సు గురించి గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే శ్రీలీల ఫ‌స్ట్ టైం త‌మిళంలోకి అడుగు పెడుతూ న‌టించిన చిత్రం ప‌రాశ‌క్తి ఈ వార‌మే థియేట‌ర్ల‌కు రానుంది.

Updated Date - Jan 09 , 2026 | 10:20 AM