అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్.. వేణుస్వామి చెప్పినట్టే జరిగిందే
ABN , Publish Date - Nov 10 , 2026 | 07:43 PM
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలను చెప్తూ వివాదాలను కొనితెచ్చుకుంటూ ఉంటాడు.
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలను చెప్తూ వివాదాలను కొనితెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే సమంత- నాగ చైతన్య విడిపోతారు అని చెప్పాడో అప్పటినుంచి అతనిపై ట్రోల్స్ నడిచాయి. పెళ్లి అయ్యి సంతోషంగా ఉంటే విడాకులు అని అంటున్నావ్.. బుద్ది లేదా..? ఈ కాలంలో జాతకాలు ఏంటి అని ఆయనపై మండిపడ్డారు. కానీ, నాలుగేళ్ల తరువాత వేణుస్వామి చెప్పినట్లుగానే ఆ జంట విడిపోయారు. దీంతో చాలామంది ఆయన మాటలను నమ్మడం మొదలుపెట్టారు. వేణుస్వామి చెప్పినవి చెప్పినట్లు జరగకపోయినా.. కొన్ని మాత్రం ఖచ్చితంగా జరిగాయి. అందుకు నిదర్శనమే పవన్ కళ్యాణ్ విడాకులు.
కొద్దికాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. ప్రముఖ సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కొన్ని జోస్యాలు చెప్పాడు. పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంలో కొన్ని అనూహ్యమైన మార్పులు వస్తాయని, వారు విడాకులు తీసుకునే అవకాశం ఉందని ఆయన అప్పట్లో పేర్కొన్నాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా, ప్రస్తుతం పవన్ - అన్నా దంపతులు విడిపోతున్నట్లు సంయుక్తంగా ప్రకటన వెలువడిన తరుణంలో నెటిజన్లు ఆ పాత వీడియోలను వెలికితీసి సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
'పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజ్నెవా విడిపోతారు. పవన్ కళ్యాణ్ కి నాలుగోవ పెళ్లి రాసి ఉందని' వేణుస్వామి చెప్పాడు. అప్పుడు సమంత విషయంలో వేణుస్వామి చెప్పింది జరిగింది.. ఇప్పుడు పవన్ విషయంలో కూడా ఆయన చెప్పిందే నిజమైంది. అంటే మిగతా సెలబ్రిటీల విషయంలో వేణు స్వామి చెప్పినవి కూడా నిజమవుతాయా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఏదిఏమైనా వేణుస్వామి న్యూస్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి తన జోస్యం నిజమయ్యిందని వేణుస్వామి ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.