Venu Swamy: రేంజ్ రోవర్ కొన్న వేణుస్వామి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ABN , Publish Date - Jan 18 , 2026 | 09:02 PM
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy) గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy) గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఓపెనింగ్స్ కి పూజలు చేయడం దగ్గర నుంచి కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తరువాత ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వారికి జాతకాలు చెప్తూ ఎదిగాడు. హీరోయిన్లకు హిట్ వచ్చేలా, సినిమాలు హిట్ అవ్వాలని పూజలు చేస్తూ ఉండే వేణు స్వామి.. అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) - సమంత (Samantha) విడాకులు తీసుకుంటారని చెప్పి ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్పినట్లే చై- సామ్ విడిపోవడంతో.. చాలామంది ఈయనను నమ్మడం మొదలుపెట్టారు.
ఇక రాజకీయ నాయకుల జాతకాల గురించి కూడా చెప్పి వివాదాల పాలైన వేణుస్వామి ఈ మధ్య సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానేసి పూజలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఒక కాస్ట్లీ కారును కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వేణుస్వామి పుట్టిన రోజున ఆయన భార్య వీణ శ్రీవాణి.. భర్తకు రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షోరూమ్ లో వేణు స్వామి, వీణ కలిసి కారును కొనుగోలు చేస్తున్న వీడియోను వారిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ కారును వేణు స్వామి కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు కోటిన్నర పైనే ఉంటుందని సమాచారం. కొందరు ఆయన్ను ట్రోల్ చేస్తుంటే,ఆయన ఫాలోవర్స్ మాత్రం వేణుస్వామి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ అదిరిందయ్యా వేణుస్వామి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.