Seetha Payanam: అస‌లు సినిమా ముందుంది.. లిరిక‌ల్ సాంగ్ అదిరింది

ABN , Publish Date - Jan 07 , 2026 | 05:17 PM

యాక్ష‌న్ కింగ్ అర్జున్ తెలుగులో తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు త‌న కూతురు ఐశ్వ‌ర్యను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేస్తు నిర్మిస్తున్న చిత్రం సీతా ప‌య‌నం.

Seetha Payanam

యాక్ష‌న్ కింగ్ అర్జున్ (Arjun) తెలుగులో తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు త‌న కూతురు ఐశ్వ‌ర్య (Aishwarya)ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేస్తు నిర్మిస్తున్న చిత్రం సీతా ప‌య‌నం (Seetha Payanam). క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర మేన‌ల్లుడు నిరంజ‌న్ (Niranjan) హీరోగా ఎంట్రీ ఇస్తుండ‌గా ప్ర‌కాశ్ రాజ్‌, స‌త్య‌రాజ్‌, అర్జున్‌, క‌న్న‌డ యాక్ష‌న్‌ ప్రిన్స్ దృవ్ స‌ర్జా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చాలా రోజుల క్రిత‌మే షూటింగ్ సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన ఏ ఊరే పిల్ల అనే పాట యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ అస‌లు సినిమా ముందుంది అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. అస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ (ChandraBose) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతంలో శ్రేయ గోషాల్ (Shreya Ghoshal) ఆల‌పించింది. ల‌లితా శోభి (Lalitha Shobi) నృత్యం స‌మ‌కూర్చింది.

అయితే.. రీసెంట్‌గా విడుద‌ల చేసిన ఈ పాట కూడా రిలీజైన క్ష‌ణాల్లోనే మంచి వ్యూస్ అంది పుచ్చుకుంటుంది. మొద‌టి పాట‌ను మించి 24 గంట‌ల్లోనే మిలియ‌న్‌కు పైగా వ్యూస్ రాబ‌ట్టుకుని ఆశ్చ‌ర్య‌ ప‌రుస్తోంది. పాట‌లోని సాహిత్యం, గాత్రం, సంగీతం అన్నీ స‌మ‌పాళ్లలో ఉండి శ్రోత‌ల‌ను, వీక్ష‌కుల‌ను ఇట్టే ఆక‌ట్టుకునేలా ఉంది. ఇక పాట‌లో పెళ్లికి ముందు ఆ త‌ర్వాత మ‌గ‌వాళ్లు ఎలా ఉంటారు మ‌గ‌వాళ్ల బుద్దుల గురించి తెలుపుతూ సాగింది. ఈ నేప‌థ్యంలో హీరోయిన్ ఐశ్వ‌ర్య డ్యాన్స్, మూతి విరుపులు అన్నీ కూడా బాగా కుదిరాయి. చూస్తుంటే కొన్నాళ్లు ఈ పాట ట్రెండింగ్‌లో ఉండేలా ఉంది. మీరూ ఓ చూపు వేసేయండి.

Updated Date - Jan 07 , 2026 | 05:33 PM