మళ్ళీ మోసం చేసిన అషురెడ్డి.. అది కూడా నిజం కాదు

ABN , Publish Date - May 09 , 2026 | 06:29 PM

నటి అషురెడ్డి (Ashu Reddy) మరోసారి షాక్ ఇచ్చింది. నిన్నటికి నిన్న తనకు నిశ్చితార్థం అయ్యిందని ఫోటోలు పెట్టి షాక్ ఇచ్చిన ఆమె.. నేడు అదంతా ఫేక్, షూటింగ్ లో జరిగిన నిశ్చితార్థం అని చెప్పి మరోసారి షాక్ ఇచ్చింది.

Ashu Reddy

నటి అషురెడ్డి (Ashu Reddy) మరోసారి షాక్ ఇచ్చింది. నిన్నటికి నిన్న తనకు నిశ్చితార్థం అయ్యిందని ఫోటోలు పెట్టి షాక్ ఇచ్చిన ఆమె.. నేడు అదంతా ఫేక్, షూటింగ్ లో జరిగిన నిశ్చితార్థం అని చెప్పి మరోసారి షాక్ ఇచ్చింది. రీల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న అషురెడ్డి ప్రస్తుతం ఒకపక్క సినిమాలు, ఇంకోపక్క సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. బిగ్ బాస్ 8 సీజన్ విన్నర్ నిఖిల్ హీరోగా తెరకెక్కిన సిరీస్ విక్రమ్ ఆన్ డ్యూటీ. ఈ సిరీస్ లో నిఖిల్ సరసన అషురెడ్డి నటించింది. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ లో ఎంగేజ్ మెంట్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఆ ఫోటోలను అషురెడ్డి షేర్ చేసి ఫ్యాన్స్ ను పిచ్చివాళ్లను చేసింది. నిజంగానే అషురెడ్డి నిశ్చితార్థం జరుపుకుందని అభిమానులు కంగ్రాట్స్ చెప్పారు.


అయితే కళ్ళతో చూసేది ఏది నిజం కాదని అమ్మడు చెప్పుకురావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నిరోజులుగా అషురెడ్డిపై చీటింగ్ కేసు ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే. ఎన్నారై ధర్మేంద్రను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి రూ. 9.5 కోట్లు తీసుకొని మోసం చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. దీంతో చాలామంది అషురెడ్డిదే తప్పు అని ఆమెపై విమర్శలు గుప్పించారు. నిజానిజాలు ఏంటి అనేది తెలియకుండా మాటలు అనకూడదు అని.. అషురెడ్డి ఈ ఫోటోలను షేర్ చేసి నెటిజన్స్ కి కౌంటర్ వేసింది.


ఎంగేజ్ మెంట్ షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ.. ' మన కళ్ళతో అకస్మాత్తుగా చూసేది గానీ, చెవులతో వినేది గానీ ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు.నిజంగా కనిపించేదంతా అసలైనది కాదు... నమ్మే ముందు ఆలోచించండి' అంటూ రాసుకొచ్చింది. అంటే ధర్మేంద్ర విషయంలో తాను ఏ తప్పు చేయలేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు.. నిజంగా పెళ్ళి చేసుకొని సెటిల్ అయితే ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పడేది అని అంటున్నారు. ఇంకొందరు మాత్రం ధర్మేంద్రనే కాదు ఫాలోవర్స్ ని కూడా మోసం చేసింది అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - May 09 , 2026 | 06:46 PM