చీటింగ్ కేసు.. సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న అషురెడ్డి

ABN , Publish Date - May 08 , 2026 | 05:33 PM

జూనియర్ సమంతగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది అషురెడ్డి (Ashu Reddy). ఆ గుర్తింపుతోనే యాంకర్ గా బుల్లితెరపై కనిపించి.. నెమ్మదిగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.

Ashu Reddy

జూనియర్ సమంతగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది అషురెడ్డి (Ashu Reddy). ఆ గుర్తింపుతోనే యాంకర్ గా బుల్లితెరపై కనిపించి.. నెమ్మదిగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇక అందాలను ఆరబోస్తూ నిత్యం సోషల్ మీడియాలో కుర్రాళ్లను కవ్విస్తూ ఉండడంలో అషురెడ్డి ఎప్పుడూ ముందు ఉంటుంది. గతంలో అషురెడ్డి పేరు డ్రగ్స్ కేసులో కూడా వినిపించింది. కానీ, అదంతా ఫేక్ అని ఆమె చెప్పుకొచ్చింది.


బుల్లితెర కామెడీ షోస్ చేసుకుంటూ కాలం గడుపుతున్న అషురెడ్డిపై ఈ మధ్యనే ఒక చీటింగ్ కేసు నమోదైన విషయం తెల్సిందే. ఎన్నారై ధర్మేంద్ర అనే యువకుడిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి.. అతని దగ్గర నుంచి రూ. 9.5 కోట్లు తీసుకొని మోసం చేసిందని ఆరోపణలు వచ్చాయి. ధర్మేంద్ర తనను అషురెడ్డి ఎలా మోసం చేసిందో ఆధారాలతో సహా పోలీసులకు తెలిపాడు. ఆ తరువాత అషురెడ్డి .. ధర్మేంద్రతో సెటిల్ మెంట్ చేసుకున్న ఆడియో కూడా బయటపడింది. ఆ డబ్బు మొత్తం చెల్లిస్తానని, తనకు కొంచెం టైమ్ కావాలని కోరింది.


ఇంకా ఆ వివాదం పూర్తిగా ముగియకముందే అషురెడ్డి సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకొని షాక్ ఇచ్చింది. తాజాగా తన ఎంగేజ్ మెంట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే వరుడు ఎవరు.. ? అనేది మాత్రం అమ్మడు రివీల్ చేయలేదు. రింగ్ పెట్టిన హ్యాండ్స్ , తాను పెళ్ళికూతురుగా రెడీ అయిన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోన్నాయి. ఒకడిని మోసం చేసి.. డబ్బు కొట్టేసి, వాడి ఖర్మకు వాడిని వదిలేసి.. మళ్ళీ వేరేవాడిని పెళ్ళి చేసుకుంటున్నావా అని కొందరు.. ఈ వివాదం ఇంకా పెద్దది కాకముందే పెళ్ళి చేసి పంపించేయాలని వాళ్ళ పేరెంట్స్ అనుకోని ఉంటారు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి అషురెడ్డి ఎంగేజ్ మెంట్ పై ధర్మేంద్ర ఎలా స్పందిస్తాడో చూడాలి.

Updated Date - May 08 , 2026 | 05:48 PM