అషురెడ్డి ఆడియో లీక్.. ధర్మేంద్రకి వార్నింగ్

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:14 PM

జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న నటి అషు రెడ్డి (Ashu Reddy) పెళ్ళి వివాదం రోజురోజుకు ముదురుతోంది

Ashu Reddy Controversy

జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న నటి అషు రెడ్డి (Ashu Reddy) పెళ్ళి వివాదం రోజురోజుకు ముదురుతోంది. లండన్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోన్న ధర్మేంద్ర అలియాస్ వెంకట్ అనే యువకుడిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి అతని వద్ద నుంచి 9.8 కోట్లు తీసుకొని మోసం చేసినట్లు కేసు నమోదైన విషయం తెల్సిందే. ధర్మేంద్ర అన్ని ఆధారాలతో అషు రెడ్డి తనను మోసం చేసినట్లు తెలిపారు. ఈ విషయమై ఇప్పటివరకు అషు రెడ్డి నోరు విప్పలేదు.


తాజాగా అషు రెడ్డి మాట్లాడిన ఆడియో అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో అషు రెడ్డి.. ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తన డబ్బులు తిరిగి చెల్లిస్తానని, తనకు మే వరకు గడువు కావాలని ఆమె మాట్లాడారు. అంతేకాకుండా మే లోపు 1.5 కోట్లు ఇస్తానని, మిగతా డబ్బులు తాను సెటిల్ అయ్యాక ఖచ్చితంగా తీర్చేస్తానని చెప్పారు. ఈ వివాదంలోకి తన కుటుంబ సభ్యులను లాగొద్దని, ఏదైనా ఉంటే తామిద్దరి మధ్యనే తేల్చుకోవాలని మాట్లాడారు. తన తరుపున పెద్ద మనుషులుగా వేణుస్వామి, ప్రవీణ ఉంటారని, వారిముందు కూర్చొని మాట్లాడదామని తెలిపారు. అలా కాదని తన కుటుంబాన్ని కనుక మధ్యలోకి తీసుకొస్తే రివర్స్ లో తనపైన హరాస్ మెంట్ కేసు పెడతానని మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఆడియో లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజమెంత.. ? నిజంగా అది అషు రెడ్డి వాయిస్ నేనా..? అనేది తెలియాలంటే ఆమె నోరు విప్పాల్సిందే.

Updated Date - Apr 28 , 2026 | 06:16 PM