నిర్మాత అశోక్‌కుమార్‌కు.. కోర్టులో ఊరట
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:09 AM
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల నేపథ్యంలో కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న నిర్మాత అశోక్‌కుమార్‌కు కోర్టులో ఊరట లభించింది.
తెలుగు నిర్మాతలమండలికి (Telugu Film Producers Council) రెండేళ్లకు ఓ సారి జరిగే ఎన్నికలు ఈ ఏడాది ఈ నెల 6న జరుగనున్నాయి. ఇందులో అధ్యక్ష పదవి కోసం సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ (C Kalyan), మరో నిర్మాత బండ్ల గణేశ్ మొదట పోటీ పడ్డారు. చివరి క్షణంలో బండ్ల గణేశ్ (Bandla Ganesh) పోటీ నుంచి తప్పుకోవడంతో సి.కల్యాణ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
ఇక కార్యదర్శి పదవికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి పోటీ పడుతున్న అశోక్‌కుమార్ (Ashok Kumar) నామినేషన్‌ను తిరస్కరించడంతో ఆయన న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న తర్వాత ఆయన నామినేషన్‌ను స్వీకరించి, ఎన్నికల ప్రక్రియలో కొనసాగేలా చూడమని ఎన్నికల అధికారికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అశోక్‌కుమార్ వెల్లడిస్తూ ‘ఇది నా వ్యక్తిగత విజయం కాదు.. నిజాయితీ, పారదర్శకత, నమ్మకం, ప్రతి సభ్యుడి ఎన్నికల హక్కుకు సంబంధించిన విషయం’ అని చెప్పారు.