రా అండ్ రస్టిక్ ‘డానీ’ ఫస్ట్ లుక్  

ABN , Publish Date - Feb 16 , 2026 | 08:27 PM

ఆశీష్ గాంధీ హీరోగా కళ్యాణ్‌జి గోగణ తెరకెక్కించిన చిత్రం ‘డానీ’. వెల్కమ్ టు లవ్ జంగిల్ ఆనంది ఉపశీర్షిక .

ఆశీష్ గాంధీ హీరోగా కళ్యాణ్‌జి గోగణ తెరకెక్కించిన చిత్రం ‘డానీ’. వెల్కమ్ టు లవ్ జంగిల్ ఆనంది ఉపశీర్షిక . రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా  టైటిల్‌తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రా అండ్ రస్టిక్ గా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. హీరో రగ్డ్ లుక్, జుట్టు, గడ్డం, బాడీ, మెడలో మాల ఇవన్నీ మాస్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే పాత్రలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి  చేసి జూన్ 26న సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రాకేందు మౌళి పాటల్ని రాయడమే కాకుండా సంగీతాన్ని అందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 09:11 PM