అర్జున్: గొప్ప సినిమా అని చెప్పను.. కానీ కనెక్ట్ అయ్యేలా సినిమా తీశాం

ABN , Publish Date - Feb 16 , 2026 | 07:46 PM

అర్జున్ సర్జా నటించి, దర్శక నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం  ‘సీతా పయనం’. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ని వెండి తెరకు పరిచయమయ్యారు.

అర్జున్ సర్జా (Arjun Sarja) నటించి, దర్శక నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం  ‘సీతా పయనం’(Seetha payanam). అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ని వెండి తెరకు పరిచయమయ్యారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా  చిత్ర బృందం థాంక్యూ మీట్ నిర్వహించింది. 

అర్జున్ మాట్లాడుతూ ‘సీతా పయనం’ కథ గ్రాటిట్యూడ్, థ్యాంకింగ్‌కి సంబంధించింది. పదమూడేళ్ల క్రితం నేను చూసిన యాక్సిడెంట్‌తో ఈ లైన్ తట్టింది. ఒక పది సెకన్లు వెనకా ముందు అయినా కూడా ఆ యాక్సిడెంట్ జరిగేది కాదు. అలా అక్కడి నుంచి ఈ ఐడియా పుట్టింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ తమ జీవితాన్ని చూసినట్టుగా ఉందని అంటున్నారు. చెడులోనూ మంచి ఉంటుందని ఇందులోని పాత్రలు రియలైజ్ అవుతుంటాయి. ప్రతీ ఒక్కరి జీవితం ఒక జర్నీలాంటిదే. నాకు నటన అంటే ఏంటో తెలియకుండానే సినిమాల్లోకి వచ్చాను. ఆ తరువాత యాక్టింగ్‌ నేర్చుకున్నాను.  దర్శకత్వం చేశాను. ‘జెంటిల్‌మెన్’తో స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ తరువాత మళ్లీ బాధ్యత పెరిగినట్టు అయింది. నా కూతురు అద్భుతంగా నటించింది అని ప్రశంసిస్తున్నారు. నేను అక్కడే పాస్ అయ్యాను.  గొప్ప సినిమా తీశానని చెప్పను కానీ మేం ఏం అనుకున్నామో అది జనాలకు కనెక్ట్ అయ్యేలా తీశాం. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, డైలాగ్ రైటర్ ఈ సినిమాకి ప్రధాన బలం. ఎంతో నిజాయితీతో ఈ మూవీని తీశాం' అన్నారు.

ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ ‘సీతా పయనం’ మా అందరికీ చాలా ప్రత్యేకం. ఆడియెన్స్ ఇస్తున్న ప్రేమను చూస్తే ఇది మాకు మరింత స్పెషల్‌గా మారింది' అన్నారు.

నిరంజన్ మాట్లాడుతూ 
'ఎంతో కష్టపడి సినిమా చేశాం. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం. నాకు ఇంత మంచి పాత్రని, సినిమాను ఇచ్చిన అర్జున్ గారికి థాంక్స్. ఎన్నో విలువలతో తీసిన ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఐశ్వర్యతో పని చేయడం సంతోషంగా ఉంది. మాకు అన్ని చోట్లా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇలానే మా సినిమాని ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ
‘ఇలాంటి స్టోరీతో సినిమా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. జనాలకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే ఆలోచనతో అర్జున్ గారు ఈ మూవీని తీశారు. ప్రతీ ఒక్కరి జీవితంలో గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ఇలాంటి చిత్రాలే ప్రస్తుతం అవసరం. నా పాటలు, బీజీఎం గురించి అందరూ మాట్లాడుతున్నారు’ అని అన్నారు.

 

Updated Date - Feb 16 , 2026 | 08:11 PM