వినూత్నమైన కథాంశంతో ‘కాన్‌సిటీ’

ABN , Publish Date - Mar 07 , 2026 | 10:16 AM

అర్జున్‌ దాస్‌, అన్నాబెన్‌, యోగిబాబు, వడివుక్కరసి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి ‘కాన్‌సిటీ’ అనే టైటిల్‌ ఖరారు చేసి, టీజర్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు.

అర్జున్‌ దాస్‌, అన్నాబెన్‌, యోగిబాబు, వడివుక్కరసి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి ‘కాన్‌సిటీ’ అనే టైటిల్‌ ఖరారు చేసి, టీజర్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ పోస్టరుతో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా... తాజాగా టైటిల్‌ టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

అప్పులతో సతమతమవుతున్న మధ్యతరగతి కుటుంబం నగర జీవితంతో ప్రారంభమయ్యే టీజర్‌ వరుస ఆశ్చర్యకరమైన సన్నివేశాలతో షాక్‌ ఇస్తుంది. అర్జున్‌ దాస్‌ బృందానికి క్యాష్‌ మెషీన్‌ లభించడం, బటన్‌ నొక్కితే డబ్బు కట్టలు రావడం ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలున్నాయి.

పవర్‌ హౌస్‌ పిక్చర్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు హరీష్‌ దురైరాజ్‌ కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. చెన్నై, మంగుళూరు, ముంబైతో సహా పలు నగరాల్లో చిత్రీకరణ జరుపుకుంది. మధ్యతరగతి కుటుంబ విశేషాలు, వినోదం నగర జీవిత వాస్తవిక అంశాలను మిళితం చేసి పూర్తి వాణిజ్య వినోదాత్మక చిత్రంగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందించి, రిలీజ్‌ చేయనున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 10:16 AM