రాజమౌళి గుట్టు రట్టు చేసిన ఆపిల్ మ్యాప్స్..

ABN , Publish Date - Nov 23 , 2026 | 08:44 PM

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక పెద్ద సినిమా మొదలయ్యింది అంటే లీకులు అనేవి వస్తూనే ఉంటాయి. ఎక్కడో ఒకచోట షూటింగ్ జరుగుతూ ఉంటే.. ఎవరో ఒకరు ఫోన్ లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తూనే ఉంటాం.

Varanasi

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక పెద్ద సినిమా మొదలయ్యింది అంటే లీకులు అనేవి వస్తూనే ఉంటాయి. ఎక్కడో ఒకచోట షూటింగ్ జరుగుతూ ఉంటే.. ఎవరో ఒకరు ఫోన్ లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తూనే ఉంటాం. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం వారణాసి(Varanasi) సినిమాకి సంబంధించి కూడా కొన్ని లీకులు బయటకు వచ్చాయి.


మహేష్ లుక్, సెట్ లో ఉన్న మహేష్.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఫైట్ ఇలా చాలా లీకులే బయటకు వచ్చాయి. అయితే ఇవన్నీ మనుషులు క్యాప్చర్ చేసిన లీకులు. తాజాగా వారణాసి నుంచి ఒక భారీ సెట్ కి సంబంధించిన వీడియో లీక్ అయ్యింది. అయితే ఇది మనుషుల పని కాదు.. ఆపిల్ ఫోన్ పని. ఆపిల్ ఫోన్ ఏం చేసింది.. ? అనేగా డౌట్. నవంబర్ మధ్యలో ఆపిల్ విడుదల చేసిన హై-రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీలో హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో నిర్మించిన వారణాసి సినిమా భారీ సెట్ విజువల్స్ బయటపడ్డాయి. ఇన్నాళ్లూ అత్యంత గోప్యంగా ఉంచిన ఈ విజువల్ వండర్ ఏరియల్ వ్యూలో స్పష్టంగా కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


ఆపిల్ మ్యాప్స్‌లోని ఈ ఏరియల్ దృశ్యాలలో బహుళ అంతస్తుల ఆలయాలు, నీటి కొలనులోకి దిగే రాతి మెట్లు, పడవలు, అద్భుతమైన పురాతన శిల్పకళా నిర్మాణాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. షూటింగ్ మొదలైన తర్వాత కోకాపేటలో ఈ భారీ సెట్టింగ్‌ను నిర్మించారు. వివిధ యుగాలు, ఖండాల మధ్య సాగే టైమ్-ట్రావెల్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి టీమ్ సృష్టించిన ఈ సెట్ స్థాయి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వారణాసి షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. సినిమా రిలీజ్‌కు ముందే సెట్ విజువల్స్ ఇలా బయటకు రావడంతో వారణాసిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక రాజమౌళి సీక్రెట్ గా ఉంచిన ఈ సెట్ గుట్టుని ఆపిల్ మ్యాప్స్ రట్టు చేశాయని నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో జక్కన్న- మహేష్ ఎలాంటి రికార్డులను బద్దలుకోడతారో చూడాలి.

Updated Date - Nov 23 , 2026 | 08:59 PM