ఉస్తాద్ భగత్ సింగ్: బెనిఫిట్ షోలకు ఏపీ సర్కార్ అనుమతి
ABN , Publish Date - Mar 13 , 2026 | 07:44 PM
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad bhagat singh) ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad bhagat singh) ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 19న తెల్లవారుజామున 4 గంటల సమయంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. దీనికి పన్నుతో కలిపి టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున పెంచుకునే అవకాశమిచ్చి, పెంచిన ధరలు ఈ నెల 19 నుంచి 28 వరకూ అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. నేపథ్య సంగీతానికి తమన్ పని చేశారు.