స్టార్‌ హీరో కొడుకుతో.. అనుపమ సంథింగ్‌ సంథింగ్‌

ABN , Publish Date - Feb 24 , 2026 | 08:10 PM

కేరళ కుట్టిగా ఎంట్రీ ఇచ్చి, తన క్యూట్ లుక్స్‌తో టాలీవుడ్‌ను షేక్ చేసిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran

కేరళ కుట్టిగా ఎంట్రీ ఇచ్చి, తన క్యూట్ లుక్స్‌తో టాలీవుడ్‌ను షేక్ చేసిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ప్రేమమ్ సినిమాతో వెండితెరపై మెరిసిన ఈ భామ, మలయాళం కంటే తెలుగులోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఇప్పటివరకు కేవలం తన సినిమాలతోనే వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అనుపమ ఇప్పుడు ఒక స్టార్ హీరో కొడుకుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

నిన్నటి వరకు తన సింగిల్ స్టేటస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానంటూ చెప్పిన అనుపమ, ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతోందట. వీరిద్దరూ కలిసి నటించిన బైసన్ సినిమా షూటింగ్ సెట్స్‌లోనే ఈ ప్రేమ చిగురించిందని చాలా మంది భావిస్తున్నారు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, అతి తక్కువ కాలంలోనే గాఢమైన స్నేహంగా మారిందని సమాచారం.

anupama.jpg

అయితే, ఈ రూమర్లకు ఆజ్యం పోసేలా తాజాగా ఒక సంఘటన జరిగింది. ధృవ్ విక్రమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. అందులో అనుపమతో కలిసి ఉన్న ఆ ఫోటోకు, అనుపమ ఏకంగా ఒక 'హార్ట్ సింబల్'ను రిప్లైగా ఇచ్చింది. ఇంకేముంది, ఈ ఒక్క పోస్ట్‌తో సోషల్ మీడియాలో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది బాబోయ్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

గతంలో కూడా అనుపమ పేరు ఒక స్టార్ క్రికెటర్‌తో వినిపించిన సంగతి మనందరికీ గుర్తే. అయితే అప్పట్లో ఆ వార్తలను ఆమె చాలా ఘాటుగానే ఖండించింది. కానీ, ధృవ్ విక్రమ్ విషయంలో మాత్రం అనుపమ రూట్ మార్చేసింది. ఈ రూమర్లపై మీడియా ప్రశ్నించినప్పుడు కేవలం ఒక చిన్న చిరునవ్వుతో దాటవేస్తోంది తప్ప, ఎక్కడా కాదు అని చెప్పడం లేదు.

anupamatillusquarelatest.jpg

ఈ మౌనమే ఇప్పుడు అనేక సందేహాలకు తావిస్తోంది. మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా, అనుపమ సైలెన్స్ చూస్తుంటే వీరిద్దరి రిలేషన్ షిప్ త్వరలోనే అఫీషియల్ కాబోతుందా అనే చర్చలు మొదలయ్యాయి. ధృవ్ విక్రమ్ ఇప్పటికే కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు అనుపమ కూడా వరుస హిట్లతో జోరు మీదుంది. మరి ఈ క్రేజీ జోడీ నిజంగానే పెళ్లి పీటల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి.

Updated Date - Feb 24 , 2026 | 08:10 PM