చిరంజీవి, నాగబాబులను.. ఎలా పిలవాలో తెలిసేది కాదు! పవన్ కల్యాణ్ భార్య.. అన్నా లెజినోవా పోస్ట్ వైరల్
ABN , Publish Date - Mar 26 , 2026 | 02:48 PM
పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే! తాజాగా ఆమె చిరంజీవి, నాగబాబులతో తన అనుబంధాన్ని పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు.
పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా (Anna Leznova) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే! తాజాగా ఆమె చిరంజీవి, నాగబాబులతో తన అనుబంధాన్ని పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. అది నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ‘నిరంతరం ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు చూపిస్తూ ఉండే మెగా ఫ్యామిలిలోకి 15 ఏళ్ల క్రితం అడుగుపెట్టాను. కొత్తలో ఇంటి సభ్యులతో ఎలా ఉండాలో.. ఎవరిని ఎలా పిలవాలో అర్థమయ్యేది కాదు. దాంతో నా భర్తను అడిగాను.
వాళ్లను ఎలా పిలుస్తున్నారో గమనించి.. చిరంజీవిని అన్నయ్య అని, నాగబాబుని చిన్నన్నయ్య అని పిలిచేదాన్ని. మొదట మామూలుగా అన్నయ్య అని పిలిచా. ఆ తర్వాతే ఆ బంధం గొప్పతనం తెలిసింది. మరోలా కూడా పిలవచ్చని తెలిసింది. తర్వాత నేను బావగారు అని పిలవడం అలవాటు చేసుకున్నా. నాకు సోదరులు లేరు.. కానీ, ఈ బంధం నాకు చిరంజీవి, నాగబాబు రూపంలో ఇద్దరు సోదరులను ఇచ్చింది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.