రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దారు

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:29 PM

వెంకటేశ్‌ (Venkatesh), కల్యాణ్‌రామ్ (Kalyan Ram)  హీరోలుగా  అనిల్‌ రావిపూడి ఓ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం  సోమవారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనుంది.

వెంకటేశ్‌ (Venkatesh), కల్యాణ్‌రామ్ (Kalyan Ram)  హీరోలుగా  అనిల్‌ రావిపూడి ఓ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం  సోమవారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనుంది.  దీనికి ముందే అనిల్ తన స్టైల్లో  ప్రమోషన్స్‌ మొదలుపెట్టేశారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌, లిరిసిస్ట్ అనంత  శ్రీరామ్‌లను ఇసుకలో పాతిపెట్టి మరీ  ట్యూన్స్‌ సిద్ధం చేయించే ప్రయత్నం చేశారు.

ఇప్పుడు ఆయన కత్తి పట్టుకుని  హంగామా చేస్తూ ‘ఎప్పుడూ నేనే ఐడియాలు ఇవ్వాలా’ అంటూ  వెంకటేష్, కళ్యాణ్ రామ్ ముందుకురాగా వెంకటేశ్‌ ఆ కత్తి తీసుకుని అనిల్‌ వేలు కోసి ఆయనకే వీర తిలకం దిద్దడంతో ఒక్కసారిగా అనిల్  షాకయ్యారు. ఆ తర్వాత  కల్యాణ్‌రామ్‌, కీర్తి సురేశ్‌, కృతిశెట్టిలు కూడా ఇలాగే చేయడంతో అనిల్‌ అవాక్కయ్యారు. జీవి మాత్రం 'నా కడుపు నిండిపోయిందిరా' అంటూ అనిల్ వేలిని పొడిచి పక్కకువెళ్లిపోయారు.

‘ఎంత రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ అయితే మాత్రం మరీ అంత రక్తపాతం అవసరమా.. మనది ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌’ అంటూ ఈ వీడియోతో  అలరించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టీం తెలిపారు.  షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Updated Date - Jun 21 , 2026 | 04:33 PM