Anil Ravipudi: అనీల్ రావిపూడి.. మొదలు పెట్టాడమ్మా! ఇక రోజుకో స్టైల్.. ప్రమోషన్
ABN , Publish Date - Jan 01 , 2026 | 10:00 PM
టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్‌కు కొత్త అర్థం చెప్పిన దర్శకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) కి ప్రత్యేక గుర్తింపు ఉంది.
టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్‌కు కొత్త అర్థం చెప్పిన దర్శకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) కి ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా క్రియేటివ్ ప్రమోషన్లతో హైప్ క్రియేట్ చేయడంలో ఆయన తర్వాతే మరెవరైనా అనే గుర్తింపును సొంతం చేసుకున్నారు. రాజమౌళి తర్వాత టాలీవుడ్‌లో ప్రమోషన్ ట్రెండ్‌ను మార్చిన దర్శకుడిగా అనిల్ పేరు తప్ప మరొకరి పేరు వినిపించదు.
ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Man Shankaravaraprasad Garu)సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపత్యంలో ఆయన తన టాలెంట్ తిరిగి స్టార్ట్ చేశారు. సాధారణంగా సినిమా ప్రమోషన్లకు అమడ దూరంగా ఉండే లేడీ సూపర్ స్టార్ నయనతారనే (Nayanthara) ఈసారి అనిల్ రావిపూడి రంగంలోకి దింపడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో నయనతార స్వయంగా అనిల్ రావిపూడిని ప్రమోషన్స్ గురించి ప్రశ్నించడం, ఆయన సరదాగా షాక్ అయి రిప్లై ఇవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వీడియోలో.. నయనతార జనవరి 12న మన శంకరవరప్రసాద్ గారు విడుదల” అని అనౌన్స్ చేయడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది.“హలో మాస్టారు.. కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇవ్వండి” అంటూ నయనతార చెప్పడం, పక్కనే అనిల్ రావిపూడి కనిపించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియోతో సినిమాపై భారీ బజ్ ఏర్పడిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
స్టార్ హీరో సినిమాలైనా సరే నయనతార ప్రమోషన్లకు దూరంగా ఉండటం తెలిసిందే. అలాంటి నయనతార చిరంజీవి సినిమా కోసం స్వయంగా ప్రమోషన్లలో పాల్గొనడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ సినిమాలో నయనతార శశిరేఖ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. చిరంజీవి – నయనతార కాంబినేషన్‌లో ఇది మూడవ సినిమా కావడంతో పాటు, అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్లతో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.