అనిల్ రావిపూడి: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. థియేటర్స్‌లో మామూలుగా ఉండదు..
ABN , Publish Date - Apr 05 , 2026 | 09:45 PM
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganadh) హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (love insurence company) నయనతార (Nayanathara) నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు.
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganadh) హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (love insurence company) నయనతార (Nayanathara) నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆ నెల 10న విడుదల చేయనున్నారు. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
అతిథిగా విచ్చేసిన అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘నయనతారతో మన శంకర్ వరప్రసాద్‌గారు’ సినిమా చేశా ఆ సమయంలో విఘ్నేశ్ శివన్ చూపించిన ఆప్యాయతనను మాటల్లో చెప్పలేను. ఆమె నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. దర్శకుడు విఘ్నేశ్ తెలుగు డబ్బింగ్ నాకు చూపించారు. డబ్బింగ్ గురించి మర్చిపోయి సినిమా ఎంజాయ్ చేశాను. న్యూ ఏజ్ కంటెంట్‌తో ఉంది. 2040లో మనం టెక్నాలజీ మీద ఎంత డిపెండ్ అవుతామో చాలా ఇన్నోవేటివ్‌గా చూపించారు. ప్రదీప్ అద్భుతంగా నటించాడు. ఎస్.జె. సూర్య మరో హైలైట్. థియేటర్స్‌లో సనిమా మామూలుగా వుండదు. ప్రదీప్ మనలో ఒకడిలా ఉండాడు. అతని నటన రియల్‌గా ఉంటుంది. అందుకే అతనికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తున్నాయి. ఈ సినిమా కూడా అతని కెరీర్‌లో మరో పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘విఘ్నేశ్ శివన్ సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ సినిమా కూడా కొత్త కథతో రూపొందింది. ఈ రోజుల్లో ప్రేమ కథ తీయడం చాలా కష్టం. అలాంటి సమయంలో అందరికీ రిలేట్ అయ్యేలా, ఒక అప్లికేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ తీఽశారు. అనిల్ రావిపూడి కూడా హీరోలా ఉంటాడు. ప్రదీప్‌లా తను కూడా యాక్టింగ్ చేేస్త సరైన కథతో, సరైన టైమ్‌లో నేను అతన్ని హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ ‘ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్ లేదా చాట్ జీపీటీని అడుగుతున్నాం. మన రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం, అన్నింటికీ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. కానీ ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం అంతా సరైనదేనా? ఇప్పుడు 2026లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, 2040లో ఎలా ఉంటుంది? మనుషుల కంటే మిషన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. మిషన్ ఎవరి పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో.. ఒక అప్లికేషన్ మనకి సరైన పార్ట్నర్ ఎవరో చెబితే? దానిపై ప్రేమను నమ్మగలమా? ఇదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో చూపించిన విషయాలు చాలా రిలేటబుల్‌గా ఉంటాయి. అదే సమయంలో కమర్షియల్‌గా కూడా చెప్పాం. లవ్, కామెడీ, సాంగ్స్ అన్నీ ఉంటాయి. విఘ్నేష్ ఎంతో ఇష్టంగా ఈ సినిమా తీశారు’ అని అన్నారు.
దర్శకుడు విఘ్నేశ్ శివన్ మాట్లాడుతూ ‘ఇది ఫ్యూచరిస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా. కథను నమ్మిన ప్రదీప్‌కు థ్యాంక్స్. అతనికి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. కృతి చాలా బాగా నటించింది. అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద మ్యాజిక్. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. కానీ అందరికీ అర్థమయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అనిల్ గారికి సినిమా చూపించాక ఆయన చెప్పిన మాటలు నాకు మరింత నమ్మకాన్ని పెంచింది’ అన్నారు.