అనిల్ రావిపూడి ఆవిష్కరించిన 'కిల్లర్' టీజర్!
ABN , Publish Date - Feb 21 , 2026 | 05:25 PM
జ్యోతి పూర్వజ్, పూర్వజ్ లీడ్ రోల్స్ చేస్తున్న సినిమా 'కిల్లర్'. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
జ్యోతి పూర్వజ్, పూర్వజ్ లీడ్ రోల్స్ చేస్తున్న సినిమా 'కిల్లర్' (Killer). ఈ సినిమాను పూర్వజ్ డైరెక్ట్ చేయడంతో పాటు ఎ. పద్మనాభ రెడ్డితో కలిసి నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'టీజర్ చాలా బాగుంది. సై ఫై, థ్రిల్లర్ జానర్స్ కలిపి ఈ సినిమాను రూపొందించారు. కాంబినేషన్స్ వెరైటీగా ఉన్నాయి. బాగా ఎగ్జిక్యూట్ చేశారు. పూర్వజ్ నాకు చాలా కాలంగా తెలుసు. అప్పుడప్పుడు కలుస్తుంటాడు. ఈ సినిమాకు సంబంధించిన సీక్వెన్స్ కొన్ని చూపించాడు. చాలా బాగున్నాయి. జ్యోతిగారిని ఎన్నో సీరియల్స్‌లో చూశాం. ఇప్పుడు ఈ మూవీలో ఆమె ట్రాన్సఫర్మేషన్ షాకింగ్‌గా ఉంది. యాక్షన్ సీన్స్‌లో బాగా చేశారు. రియల్ లైఫ్‌లో భార్యాభర్తలు ఈ రీల్ లైఫ్‌లో ఎలా చేశారు? అనేది ఆసక్తికరంగా ఉంది' అని అన్నారు.
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ, 'ఎంతో బిజీగా ఉన్నా మా మూవీ టీజర్‌ను అభిమానంతో అనిల్ రావిపూడి (Anil Ravipudi) గారు రిలీజ్ చేశారు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో ఆయన ముందుంటారు. కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్న ఈ టైమ్‌లో కూడా చిన్న చిత్రాలకు సపోర్ట్ చేస్తున్న ఆయన పెద్ద మనసుకు థ్యాంక్స్' అని అన్నారు. డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ, 'అనిల్ గారు చాలా హెక్టిక్ వర్క్‌లో ఉన్నారు. నేను ఆయనతో మాట్లాడినప్పుడు 'మీరు ఫ్రీగా ఉన్నప్పుడు టీజర్ రిలీజ్ చేద్దాం సార్' అన్నాను. కానీ ఆయన 'మనం పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి. కొత్త వాళ్లకు మన వంతు ప్రోత్సాహం ఇవ్వాలి' అంటూ టీజర్ రిలీజ్ చేశారు. అనిల్ గారి పాజిటివిటీ మా టీమ్‌కు కూడా రావాలి. ఆయనకు మా టీమ్ అందరి తరపున థ్యాంక్స్ చెబుతున్నాను. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం' అని అన్నారు.