అనిల్ రావిపూడి కాలర్ పట్టుకొని వార్నింగ్ ఇచ్చిన సుడిగాలి సుధీర్

ABN , Publish Date - Jul 20 , 2026 | 08:02 PM

మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఒకపక్క సినిమాలతో పాటు ఇంకోపక్క డ్రామా జూనియర్స్ సీజన్ 9 షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.

Anil Ravipudi

మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఒకపక్క సినిమాలతో పాటు ఇంకోపక్క డ్రామా జూనియర్స్ సీజన్ 9 షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ షోకి సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) యాంకర్ గా చేస్తున్నాడు. స్కిట్స్ కాకుండాఈ ఇద్దరి మధ్యనే వచ్చే సంభాషణలే ఎక్కువ నవ్వులు పూయిస్తాయి. తాజాగా ఈ షోలో అనిల్ రావిపూడి,సుధీర్ ఒకరికొకరు కాలర్ పట్టుకొని వార్నింగ్ లు ఇచ్చుకున్నారు. అది కూడా ఒక సరదా సీన్ కోసమే. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


సూపర్ హిట్ సినిమా అనిమల్ థీమ్‌ను రీక్రియేట్ చేస్తూ వీరిద్దరూ చేసిన కామెడీ యాక్టింగ్ స్టేజ్ మొత్తాన్ని దద్దరిల్లేలా చేసింది. మొదటగా అనిల్ రావిపూడి అనిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తరహాలో పవర్ ఫుల్ వాయిస్‌తో సుధీర్ కాలర్ పట్టుకొని క్లాస్ పీకాడు. ఎన్నిసార్లు చెప్పాలిరా... ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసి హీరో అయ్యావ్, మళ్లీ హీరోనై ఉండి ఫ్రెండ్ పాత్రకి వస్తావా? అంటూ ఆవేశంగా అరిచే సన్నివేశంలో అనిల్ టైమింగ్ ఆకట్టుకుంది. ఆ వెంటనే రోల్స్ రివర్స్ చేసి.. సుధీర్ కూడా అనిల్ రావిపూడి కాలర్ పట్టుకుని అదే డైలాగ్‌ను రీక్రియేట్ చేస్తూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు.ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ అండ్ కామెడీ టైమింగ్ చూసి అక్కడ ఉన్న జడ్జీలు, చిన్నారులు, ప్రేక్షకులు నవ్వులు పూయించారు.


ఇక సుధీర్ జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని హీరోగా మారిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సుధీర్ నటించిన గోట్ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుండగా.. హైలెస్సో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక త్వరలోనే ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఈ సినిమాలతో సుధీర్ హీరోగా సెటిల్ అవుతాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Updated Date - Jul 20 , 2026 | 08:08 PM