ఇట్లు అర్జున.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ABN , Publish Date - Oct 31 , 2026 | 06:48 PM
యంగ్ యాక్టర్ అనీష్ హీరోగా, వర్సటైల్ మలయాళీ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం 'ఇట్లు అర్జున' (Itlu Arjuna).
యంగ్ యాక్టర్ అనీష్ హీరోగా, వర్సటైల్ మలయాళీ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం 'ఇట్లు అర్జున' (Itlu Arjuna). మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ (Thaman S) సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాని అక్కినేని నాగార్జున సమర్పించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని బావుండి ఉంటే ఈ శుక్రవారమే ఇట్లు అర్జున ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
అయితే, ఆదర్శ కుటుంబం సినిమాతో పోటీ ఎందుకులే అని ఇట్లు అర్జున వెనక్కి తగ్గినట్లు సమాచారం. కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. తాజాగా మేకర్స్ తమ కొత్త రిలీజ్ డేట్ ని తెలిపారు. నవంబర్ 13 న ఇట్లు అర్జున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అనీష్, అనస్వర రాజన్ల కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈసారి కూడా ఈ సినిమా సింగిల్ గా రావడం లేదు. ఆదర్శ కుటుంబం కోసం వెనక్కి తగ్గిన సినిమాలు అన్ని కూడా ఇదే రోజున రావడం గమనార్హం. అంతేకాకుండా మరో పెద్ద సినిమా కూడా ఈ లిస్ట్ లో ఉంది. అదే భోగి.
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సంపత్ నంది దర్శకత్వం వహించిన భోగి సినిమా నవంబర్ 12 న థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే భోగి నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రా అండ్ రస్టిక్ లుక్ లో శర్వా.. డీ గ్లామర్ లుక్ లో అనుపమ పిచ్చెక్కించారు. ఈ సినిమాపై ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. మరి ఈ సినిమాతో ఇట్లు అర్జున ఢీ కొట్టబోతుందా.. లేదా భోగి ఏమైనా వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.