బాడీ కౌంట్ వివాదం.. మళ్ళీ రెచ్చగొట్టిన విష్ణుప్రియ
ABN , Publish Date - Jun 16 , 2026 | 08:25 PM
బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ (Vishnupriya) సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. తన బోల్డ్ ఆటిట్యూడ్‌తో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే ఈ బ్యూటీ.. లైవ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ (Vishnupriya) సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. తన బోల్డ్ ఆటిట్యూడ్‌తో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే ఈ బ్యూటీ.. లైవ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఏ ఆడపిల్ల చెప్పని బాడీ కౌంట్ గురించి అమ్మడు ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్‌గా చెప్పి షాక్ ఇచ్చింది. ఇప్పటికే సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు సంపాదిస్తోంది అని ఆమెపై చాలామంది ఫైర్ అవుతున్నారు. ఇక ఈ బాడీ కౌంట్ వివాదం కూడా తోడవ్వడంతో విష్ణుప్రియపై నిప్పులు చేరుగుతున్నారు.
రెండు రోజుల క్రితం విష్ణుప్రియ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారితో స్పెషల్ గా లైవ్ లో మాట్లాడింది. ఇందులో ఆమె తన బాడీ కౌంట్ 5 అని చెప్పింది. అంటే 5గురితో ఆమె రొమాన్స్ చేసినట్లు ఓపెన్ గా ఒప్పుకుంది. దీంతో విష్ణుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఛీఛీ డబ్బులు కోసం ఎంతకు తెగించింది అని కొందరు.. ఇలా చెప్తే ఆమెకు పెళ్లి ఎలా అవుతోందని ఇంకొందరు.. సమాజంలో అమ్మాయిలు ఇలానే తయారవుతున్నారు అని మరికొందరు.. అసలు ఆ ఐదుగురు ఎవరు.. అని చాలామంది ఆరాలు తీస్తున్నారు. రెండు రోజుల నుంచి విష్ణు బాడీ కౌంట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సాధారణంగా ఇంత జరిగకా ఎవరైనా ముఖం కూడా చూపించరు. కానీ, విష్ణు మాత్రం మరో బాంబ్ పేల్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తుండటంతో విష్ణుప్రియ అంతే ఘాటుగా స్పందించింది. నిజాయితీగా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది.సమాజం ఏమనుకున్నా సరే, తను ఏ విషయంలోనూ అబద్ధం చెప్పదలుచుకోలేదని, తన లైఫ్ తన ఇష్టమనే రీతిలో ఆమె క్లారిటీ ఇచ్చింది. దీంతో విష్ణు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఇంకొందరు మాత్రం ఆమె కావాలనే ఇలా చేస్తోందని, ఇలా పాపులర్ అవ్వాలని ఇలాంటి కామెంట్స్ చేస్తోందని అంటున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.