Anasuya: వాళ్లు నటులు మాత్రమే.. నేనే రియల్ హీరోయిన్నీ
ABN , Publish Date - Jan 06 , 2026 | 07:44 PM
వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా అని వచ్చేస్తుంది హాట్ యాంకర్ అనసూయ (Anasuya). ముఖ్యంగా ఆడవారిని ఎవరైనా ఏదైనా అనకూడని మాట అన్నారు అంటే .. వారిని కడిగిపడేయడానికి ముందు వరుసలో ఉంటుంది.
Anasuya: వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా అని వచ్చేస్తుంది హాట్ యాంకర్ అనసూయ (Anasuya). ముఖ్యంగా ఆడవారిని ఎవరైనా ఏదైనా అనకూడని మాట అన్నారు అంటే .. వారిని కడిగిపడేయడానికి ముందు వరుసలో ఉంటుంది. ఫెమినిస్ట్ గా ఆడవారి హక్కులు, వారి స్వేచ్ఛ గురించి పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇక ఈ మధ్య నటుడు శివాజీ.. ఆడవారి డ్రెసింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ వివాదంలో ఎవరు కదిలించకుండానే అనసూయ వచ్చింది. ఆడవారు ఎలా ఉండాలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని, శివాజీ (Shivaji) చాలా పద్దతిగా చెప్పినట్లే తాను కూడా ఇలాంటివి చెప్పడం మానేయమని చాలా పద్దతిగా చెప్తున్నట్లు చెప్పుకొచ్చింది.
ఇక శివాజీ - అనసూయ మధ్య మాటల యుద్ధం జరిగింది. అదంతా ఒకపక్క నడుస్తుంటే అనసూయకు సపోర్ట్ చేసేవాళ్ళు శివాజీపై మండిపడుతున్నారు. శివాజీకి సపోర్ట్ చేసేవాళ్ళు అనసూయ ముందు వీడియోలు బయటకు తీసి ఆమె కుటుంబంతో సహా సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. అనసూయ చేసిన షోస్ లలో ఆమె అందాలను ఆరబోయడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం, బికినీ వేసుకున్న ఫోటోలు ఇలా ఒకటి అని కాదు. ఎంతగా ట్రోల్ చేయాలో అంతగా ట్రోల్ చేస్తున్నారు.
శివాజీ చెప్పింది హీరోయిన్స్ గురించి అయితే నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావ్.. నువ్వెప్పుడు హీరోయిన్ వి అయ్యావు అని కొందరు విమర్శిస్తున్నారు. తాను ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేసినట్లు ఆమె చెప్పుకొచ్చిన ట్రోలర్స్ ఆ మాటను వదలకుండా ఏ సినిమాలో హీరోయిన్ గా చేసావో కూడా చెప్పు అంటూ ఇంకా రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు. దీంతో అనసూయ మరోసారి ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది. హీరోయిన్ అంటే అసలైన మీనింగ్ ఇది అంటూ డిక్షనరీ స్క్రీన్ షాట్ పెట్టి మరీ చూపించింది. అసలైన హీరోయిన్ తానే అని చెప్పుకొచ్చింది.
హీరోయిన్ అంటే డిక్షనరీలో కథానాయిక అనే కాదు.. దైర్యం గల స్త్రీ అని కూడా అర్ధం. దానిని అండర్ లైన్ చేసి మరీ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ ఇప్పుడు కొందరిని ఎడ్యుకేట్ చేద్దాం అంటూ రాసుకొచ్చింది.' హీరోయిన్ తెరపై కాదు.. సత్యం మాట్లాడే ధైర్యం.. సొంత దారి నడిచే శక్తి. సరైనదానికి నిలబడే గుండె. అదే నిజమైన హీరోయిన్. మిగతావాళ్లు కేవలం నటులు మాత్రమే' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.