Anasuya: పెద్ది వివాదం.. అనసూయ వైరల్ పోస్ట్..
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:00 PM
తరచూ వార్తల్లో ఉండే అనసూయ మరోసారి సినిమా ఇండస్ర్టీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంపై బాధ్యత, సృజనాత్మకత, స్వేచ్ఛ గురించి సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
తరచూ వార్తల్లో ఉండే అనసూయ (Anasuya) మరోసారి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంపై బాధ్యత, సృజనాత్మకత, స్వేచ్ఛ గురించి సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.‘సినిమా అనేది ఎప్పుడు సమాజానికి ప్రతిబింబంలాంటిది. సినిమాల ప్రభావం సమాజంపై చాలా ఉంటుంది. అలాగని సమాజాన్ని మంచి మార్గంలో ముందుకు నడిపించాలని, నడిపిస్తాయని ఆశించకూడదు. సృజనాత్మక స్వేచ్ఛ, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమే. సమాజంలో జరిగే ప్రతి విషయానికి సినిమాను తప్పు పట్టలేము. బయట జరిగే ప్రతి విషయాన్ని సినిమాతో ముడిపెట్టవద్దు. ఒకప్పటి సినిమా కథలలో నైతికత కనిపించేది. హీరో పాత్రలు బాఽధ్యతగా, స్ఫూర్తిదాయకంగా ఉండేది. విలన్ పాత్రను అనుసరించకూడదు అనిపించేది. ప్రస్తుతం వస్తున్న కథల్లో ఆ క్లారిటీ మిస్ అయింది. పాత్రను గొప్పగా చూపించడం కోసం దర్శకులు ఈ సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఓ కథను తెరకెక్కిస్తున్నామంటే.. దాని ప్రభావం ఎలా ఉంటుందనే దానిలో టెక్నికల్ టీమ్ నుంచి దర్శక నిర్మాతలు నటీనటులు, చివరకు ప్రేక్షకులు కూడా బాధ్యత వహించాలి. క్రియేటివీ విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల వల్ల నేను కొన్ని షోల నుంచి బయటకు వచ్చాను. దానివల్ల నా టాలెంట్‌కు తగ్గ అవకాశాలు రావడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా. అయినా నా సిద్థాంతాల కోసమే నిలబడ్డాను’ అని అనసూయ అన్నారు.
ప్రస్తుతం ఉన్న సమాజంలో సోషల్ మీడియాలో చాలామంది ముందుకువచ్చి పలు విషయాలపై చర్చలు పెట్టడం, సినిమాల్లో కొన్ని పాత్రలను చూపించే విధానాలను ప్రశ్నించడం, విమర్శించడం చూస్తే ఆనందంగా ఉంది. అవసరం వచ్చినప్పుడు తప్పును నిలదీయాలి. కానీ సృజనాత్మకతపై దాడి చేయకూడదు. అయితే ఈ పోస్ట్‌తో నేను ఎవరినీ నిందించడం లేదు. ఈ వ్యవస్థలో మనమంతా ఓ భాగమేనని గుర్తు చేయడమే నా ఉద్దేశం. ఇకపై అయినా క్రియేటర్స్, ఆర్టిస్టులు, దర్శకనిర్మాతలు, ఇన్‌ఫ్లూయెన్పర్లు, ఆడియన్స్ సామాజిక స్పృహతో వ్యవహరించాలిన బాఽధ్యతాయుతమైన కంటెంట్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.