Anasuya: అనసూయపై బోరబండ పీఎస్‌లో బీజేపీ నేతల ఫిర్యాదు!

ABN , Publish Date - Aug 17 , 2026 | 10:05 AM

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌  వార్తల్లో నిలిచారు. ఆమెకి మరో షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు.

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌ (Anasuya) వార్తల్లో నిలిచారు. ఆమెకి మరో షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. అనసూయ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో అనసూయ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘జై శ్రీరామ్’ పేరుతో కొందరు దాడులకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాలపై సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అనసూయకు సూచించారు.

అయితే ఈ వివాదంపై అనసూయ మాత్రం వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విమర్శలు చేస్తున్న వారికి కూడా ఆమె ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల ‘దొంగలంతా బయటకు వస్తున్నారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు.  అనసూయ వ్యాఖ్యలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆమెను విచారిస్తారా? ఈ వివాదం మరింత ముదురుతుందా? అనే అంశాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Aug 17 , 2026 | 10:47 AM