అనసూయకు కౌంటర్... 'ఎమక్కో ఇట్టాగున్నారు'! కొత్త ఫోక్ సాంగ్ రిలీజ్
ABN , Publish Date - Feb 19 , 2026 | 10:14 PM
కాస్త విరామం తర్వాత ఓ కొత్త జానపద గీతం యూట్యూబ్‌లో విడుదలై అదిరిపోయే వ్యూస్ దక్కించుకుంటోంది.
కాస్త విరామం తర్వాత మరో ఆసక్తికరమైన ఓ ప్రైవేట్ సాంగ్ 'ఎమక్కో ఇట్టాగున్నారు.. మీరు ఎందక్కొ ఇట్టాగున్నారు' (Emakko Ittagunnaru Full Song ) అంటూ సాగే కొత్త జానపద గీతం (Folk Song) యూట్యూబ్‌లో విడుదలై అదిరిపోయే వ్యూస్ దక్కించుకుంటోంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన యాక్టర్ శివాజీ ఘటన, అనసూయ కామెంట్లు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ పాటను రూపొందించడం విశేషం. ఓ వైపు మహిళల వస్తధారణల గురించి చెబుతూనే మరోవైపు మహిళలు ఏ యే రంగాల్లో ఏ స్థాయిలో రాణిస్తున్నారనే అంశాలను ఈ పాటలో పొందుపర్చారు.
ఇదిలాఉంటే.. రెండు నెలల క్రితం దొండకాయ.. బెండకాయ.. అనుపమ నువ్వే నా గుండెకాయ (dondakaya bendakaya) అనే ఫోక్ సాంగ్‌తో అలరించిన జబర్దస్త్ ఆర్టిస్ట్, సింగర్ నవ సందీప్ (Navasandeep) ఈ పాటకు సైతం సాహిత్యం అందించి ఆలపించాడు. జాన్, గణేశ్ (John, ganesh) సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒక్కమారు వింటే ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంది. కాకపోతే పాట అంతా అనసూయ (Anasuya Bharadwaj) మాటలనే టార్గెట్ చేసినట్లు ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఈ పాటపై మీరూ ఓ లుక్ వేయండి.