Ananth Sriram: ప్రేక్షకుడు కలుషితం కావడం వల్లే .. దర్శకులు కలుషితం అవుతున్నారు

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:08 PM

‘పెద్ది’ (Peddi) సినిమాలోని జాన్వీ క్యారెక్టక్‌ను చూపించిన విధానం, ఐటెమ్స్‌ సాంగ్‌లోని లిరిక్స్‌పై ట్రోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే!

‘పెద్ది’ (Peddi) సినిమాలోని జాన్వీ క్యారెక్టక్‌ను చూపించిన విధానం, ఐటెమ్స్‌ సాంగ్‌లోని లిరిక్స్‌పై ట్రోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే! ఆ పాటకు సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్‌ (Ananta sriram) చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ‘ఐటెం పాటను ఐటెం (Peddi Item Song) పాటలాగ చూసినవాళ్లు ఒక స్పెషల్‌ ఐటెంను రుచి చూశారు. అలా చూడలేనివారు వాళ్లే ఒక ఐటెం గాళ్ల కింద లెక్క’ అని కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. విమర్శలు చేసేవారు నిర్దిష్టమైన ఆరోపణలు చేయాలని, కేవలం భావోద్వేగాలతో, ప్రత్యేక ఎజెండాతో మాట్లాడితే వాటికి సమాధానం చెప్పక్కర్లేదని అన్నారు. అంతే కాదు దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ తనకు నచ్చలేదని అన్నారు. దర్శకుడికి తన కథ,  పాత్రపై పూర్తి  స్వేచ్చ ఉండాలన్నారు. ‘ఎవరో విమర్శించారని క్షమాపణలు చెప్పుకుంటూ పోతే సృజనాత్మక స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది’ అని ఆయన ప్రశ్నించారు. దాంతో ఈ వివాదం వేడి మరింత పెరిగినట్లైంది.


అలాగే మరో వేదికపై ఓ అభిమాని అనంత శ్రీరామ్‌ను ప్రశ్నించారు. ‘సరుకు, సామాను అంటూ లిరిక్స్‌ రాస్తున్నారు.. ఆడవాళ్లను వస్తువుతో పోల్చుతున్నారు’ ఇది ఎంత వరకూ కరెక్ట్‌? ఇలా రాసే గేయ రచయితలకు మీరేం చెప్తారు అని ప్రశ్నించగా ‘సినిమా అనేది వ్యాపారాత్మక కళ, కళాత్మక వ్యాపారం. ఆర్ట్‌ని, కామర్స్‌ని వేరు చేయలేనిది సినిమా. ఒకవేళ్ల మీకు నచ్చకపోతే మీరుు ఆ వ్యాపారంలో ఎంత శాతం ఉన్నారో లెక్కలేసుకోవాలి’ అప్పుడు మీకే క్లారిటీ వస్తుంది’ అని అన్నారు.

పదహారేళ్ల కుర్రాడు కూడా ‘సరుకు, సామాను’ అంటూ పాడతూ వాడు మరో పదిమందికి చెబుతున్నాడు. మహిళలుగా వీటిపై ప్రతిసారీ విప్లవం చేయడానికి మా దగ్గర అంత పవర్‌ లేదు కదా? సినిమా, పాటల రూపంలో చెప్పేవాళ్లే కాస్త బ్యాలెన్స్‌గా చెబితే బావుంటుంది కదా. అన్న ప్రశ్నకు.. ‘ ఆ పవర్‌ మాకు కూడా లేదు. మా పవర్‌ టికెట్‌ రేటు 150 ఉంది కదా. ఆ రేటుతో ఎంతమంది సినిమా చూశారనేదానిపైనే ఉంటుంది. పవర్‌ అనేది సంఘటితంగా రావాలి కానీ ఒక్క పక్క నుంచే రావాలంటే కష్టం. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. అదే నియంతృత్వ వ్యవస్థలో ఉంటే కచ్చితంగా పైనున్న ప్రభుత్వం ఇలాంటి పదాలు రాయడానికి వీల్లేదు’ అని ఉక్కుపాదంతో సినిమాను తొక్కేస్తుంది. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ఓటరు ఎలా అవినీతిపరుడు అవుతున్నాడో.. ప్రేక్షకుడూ అలాగే కలుషితం అవుతున్నాడు. దాంతో దర్శకుడు కలుషితం అవుతున్నాడు. కచ్చితంగా విత్తనంలోనే మార్పు రావాలి’ అని అన్నారు. 

Updated Date - Jun 16 , 2026 | 02:43 PM