Epic Trailer: ఒక రిలేషన్ షిప్ ఎపిక్ ఎప్పుడవుతుందో తెలుసా..
ABN , Publish Date - Sep 04 , 2026 | 08:47 PM
#90s వెబ్ సిరీస్‌తో విశేష ఆదరణ పొందిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఎపిక్ (Epic). బ్లాక్‌బస్టర్ హిట్ బేబీ చిత్రం తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న రెండవ చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి.
#90s వెబ్ సిరీస్‌తో విశేష ఆదరణ పొందిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఎపిక్ (Epic). బ్లాక్‌బస్టర్ హిట్ బేబీ చిత్రం తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న రెండవ చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీ, వాసుకి కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
#90s వెబ్ సిరీస్ లో చిన్న కొడుకు ఆదిత్య ప్రయణమే ఎపిక్ సినిమా. చిన్నతనం నుంచి చదువు రాకపోవడంతో ఆదిత్య డైరెక్టర్ కావాలనుకుంటాడు. ఇంట్లో తండ్రి పోరు పడలేక లండన్ లో చదువుకుంటాను అని చెప్పి అక్కడికి వెళ్తాడు. అక్కడ ఆదిత్యకు కడలి పరిచయమవుతుంది. ఆమెకు రిలేషన్ మీద, ఎమోషన్స్ మీద పెద్ద నమ్మకం ఉండదు. అయినా వీరిద్దరి మధ్య పరిచయం, ప్రేమగా మారి.. సెక్స్ వరకు వెళ్తుంది. అది జరిగాక.. కడలి డామినేషన్ ఎక్కువ అవుతుంది. ఆ తరువాత ఆదిత్య లైఫ్ ఎలా మారింది.. ? అసలు కడలికి ఏం కావాలి.. ? ఆమె ఎందుకు ఇండియా వచ్చేస్తుంది.. ? వీరిద్దరికీ బ్రేకప్ ఎందుకు అయ్యింది.. ? ఆదిత్య డైరెక్టర్ అయ్యాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
లండన్ నేపథ్యంలో సాగే ఆదిత్య- కడలి లవ్ స్టోరీ, కాలేజ్ లైఫ్, అలాగే వారి మధ్య వచ్చే ఎమోషనల్ మైండ్ గేమ్‌లను ఆదిత్య హాసన్ చాలా ప్రాక్టికల్‌గా, నేటి యూత్‌కు కనెక్ట్ అయ్యేలా మలిచినట్లు కనిపిస్తోంది. బ్రేకప్, ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్ వంటి అంశాలను ట్రైలర్‌లో చాలా సహజంగా చూపించారు. ఆనంద్ - వైష్ణవి మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.