ఎపిక్ టీజర్.. బేబీ జంట మరోసారి రెచ్చిపోయారుగా

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:31 PM

ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటిస్తోన్న చిత్రం ఎపిక్ (Epic).

Epic Tease

ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటిస్తోన్న చిత్రం ఎపిక్ (Epic). బేబీ లాంటి భారీ విజయం తరువాత ఈ జంట మరోసారి ఎపిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. #90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా ఎపిక్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. #90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో చిన్న కొడుకు ఆదిత్య పెద్దయ్యాక జరిగే కథతో ఎపిక్ తెరకెక్కుతోంది. అసలు చదువే రాని ఆదిత్య.. తల్లిదండ్రుల బలవంతంతో విదేశాలకు చదువుకోవడానికి వెళ్తాడు. అక్కడ కడలి అనే ఒక అమ్మాయి పరిచయమవుతుంది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. మరి వారి ప్రేమ ఎక్కడివరకు వెళ్ళింది..? జీవితంలో ఆదిత్య ఏం సాధించాడు.. ? అనేది థియేటర్ లో చూడాల్సిందే.


#90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ లో హైలైట్ అంటే ఆదిత్య క్యారెక్టర్ నే. ఇప్పుడు ఆ క్యారెక్టర్ నే హీరోగా మార్చడంతో అంతకు మించిన కామెడీ ఈ సినిమాలో ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. టీజర్ ని బట్టి ఆదిత్య హాసన్.. చాలా పకడ్బందీగా కథను రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆదిత్యగా ఆనంద్ సరిగ్గా సరిపోయారనిపిస్తుంది. బేబీ సినిమాలో ఆనంద్- వైష్ణవి పెయిర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మరోసారి ఈ జంట రొమాన్స్ తో రెచ్చిపోయారు. ఇక హేషేమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని నెటిజన్స్ అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

Updated Date - Apr 29 , 2026 | 07:01 PM