Anaganaga Oka Raju: ఎంత నవ్విస్తుందో.. అంతే భావోద్వేగాన్ని కలిగిస్తుంది

ABN , Publish Date - Jan 13 , 2026 | 05:17 PM

తెలుగువారికి సంక్రాంతి అనేది ప్రత్యేకమైన పండుగ. ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి మన వాళ్ళను కలుసుకొని సంతోషంగా ఉంటాం. ఒత్తిడిని పక్కన పెట్టి, పిండి వంటలు తింటూ, నలుగురితో నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటాం.


నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన చిత్రం  'అనగనగా ఒక రాజు'.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది. తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. 

నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ 'తెలుగువారికి సంక్రాంతి అనేది ప్రత్యేకమైన పండుగ. ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి మన వాళ్ళను కలుసుకొని సంతోషంగా ఉంటాం. ఒత్తిడిని పక్కన పెట్టి, పిండి వంటలు తింటూ, నలుగురితో నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటాం. అలాంటి ఎనర్జీనే 'అనగనగా ఒక రాజు'లో చూడబోతున్నారు. మన ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా సినిమా ఉంటుంది. ట్రైలర్ కి మీ నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన.. సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ట్రైలర్ లో ఉన్న జోక్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒక పర్ఫెక్ట్ పండగ సినిమాలా ఉంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంది, చాలా చాలా బాగుంది అంటూ అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే బుకింగ్స్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ తోనే నా గత చిత్రాల ఓపెనింగ్స్ ని దాటేసింది. మీరు ఈ సినిమాపై చూపుతున్న ఆసక్తికి తగ్గట్టుగానే.. మిమ్మల్ని అలరించేలా ఈ సినిమా ఉంటుంది' అన్నారు.

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "మేమందరం ఎంతో కష్టపడి పని చేసి.. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాము. ఈ సినిమాపై మీ స్పందన కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. మీరు ఈ సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. మీ కుటుంబంతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. హాయిగా నవ్వుకుంటూ.. ఈ సంక్రాంతి పండుగను జరుపుకోండి' అన్నారు.




దర్శకుడు మారి మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్ ఇది. సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పండుగ. సంక్రాంతి అనేది తెలుగువారికి ఒక ఎమోషన్. సంక్రాంతి కానుకగా మా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. ఈ పండగకు మీ కుటుంబంతో కలిసి చూసి హాయిగా నవ్వుకునే క్లీన్ ఎంటర్టైనర్ ఇది. జనవరి 14న కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్ళి.. మీ బాధలన్నీ మర్చిపోయి రెండున్నర గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోండి. రాజు గారితో ఈ పండగను ఎంజాయ్ చేయండి." అన్నారు.

సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ 'గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ఈ సినిమా రూపొందింది. నవీన్ శైలిలో చాలా సరదాగా సినిమా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉంటుంది. సినిమా ఎంత నవ్విస్తుందో.. అదే సమయంలో చివరిలో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫైట్, పాటలు ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన పండగ సినిమా ఇది' అన్నారు. Meenu.jpg

Updated Date - Jan 13 , 2026 | 05:19 PM