అల్లు స్నేహారెడ్డికి అరుదైన గౌరవం..
ABN , Publish Date - Nov 12 , 2026 | 06:22 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. భారతదేశంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే బావోలి ఆర్ట్ సంగం (Baoli Art Sangam) లో ఆమె కీలక బాధ్యతలు చేపట్టింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. భారతదేశంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే బావోలి ఆర్ట్ సంగం (Baoli Art Sangam) లో ఆమె కీలక బాధ్యతలు చేపట్టింది. ఈ భారీ వేడుకకు సంబంధించి కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి నియమితమయ్యింది. ఫ్యాషన్, కళలు, భారతీయ సంస్కృతిపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆమె ఈ కార్యక్రమంలో భాగం కావడం విశేషంగా మారింది.
భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని నేటి తరానికి మరింత చేరువ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశంలోని చారిత్రక మెట్ల బావుల (స్టెప్‌వెల్స్) విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, వాటి అద్భుతమైన నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యత, నీరు, కళలు, నాగరికత మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వేదిక ద్వారా చాటిచెప్పనున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు స్నేహారెడ్డి భాగస్వామ్యం భారతీయ కళా వారసత్వంపై మరింత అవగాహన పెంచడంతో పాటు, మన సంస్కృతి మూలాలను గౌరవించేలా ప్రజలను ప్రోత్సహించనుంది. కాగా, బావోలి ఆర్ట్ సంగం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు అత్యంత వైభవంగా జరగనుంది.
'భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బావోలి ఆర్ట్ సంగం(స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే) కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది. 13కి పైగా చారిత్రక మెట్ల బావులు, వారసత్వ ప్రదేశాలలో 200 మందికి పైగా కళాకారులతో సాగే ఈ వేదిక సమకాలీన కళలు, ప్రదర్శనల ద్వారా మన నగర సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటనుంది. ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా మన చరిత్రాన్ని, వారసత్వాన్ని ముఖ్యంగా యువతరానికి మరింత చేరువ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని స్నేహా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
ఈ విషయం తెలియడంతో అల్లు ఫ్యాన్స్ స్నేహారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లు అర్జున్ భార్య..స్నేహా ఒక వ్యాపారవేత్త అని అందరికీ తెల్సిందే. ఆమెకు సొంతంగా స్టూడియో పికాబూ అనే స్టూడియో ఉంది. అంతేకాకుండా ఎడిటర్ గా కూడా ఆమె పనిచేస్తోంది. ఇక ఇప్పుడు స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే బావోలి ఆర్ట్ సంగం చైర్ పర్సన్ గా కూడా ఎంపిక అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్.. అది అల్లు అర్జున్ భార్య అంటే. భర్త తన సినిమాలతో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకుంటుంటే.. భార్య కూడా అంతే ఇమేజ్ ని సంపాదించుకుంటుంది. చూడచక్కని జంట మాత్రమే కాదు ఆదర్శ జంట కూడా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. రాకా సినిమాతో బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.