అల్లు వారి.. పెళ్లి ప‌నులు షురూ

ABN , Publish Date - Feb 13 , 2026 | 08:42 PM

అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీశ్ పెళ్లి పనులు ప‌సుపు కార్య‌క్ర‌మంతో అట్ట‌హ‌సంగా ప్రారంభమ‌య్యాయి.

allu sirish

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) సోదరుడు అల్లు శిరీశ్ (allu sirish) పెళ్లి పనులు ప‌సుపు కార్య‌క్ర‌మంతో అట్ట‌హాసంగా ప్రారంభమ‌య్యాయి. ఈ వేడుక‌కు ద‌గ్గ‌రి బంధువులంతా హ‌జ‌ర‌య్యారు. కాగా మార్చి 6న అల్లు శిరీశ్, నయనిక (nayanika)ల‌ పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది. గత నెల దుబాయ్‌లో జ‌రిగిన వీరి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ బాలీవుడ్‌, టాలీవుడ్ మీడియాల‌లో బాగా హ‌ల్‌చ‌ల్ చేసింది.

ఇప్పుడు.. తాజాగా హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ ఇంట్లో నిన్న సంప్రదాయబద్ధంగా పసుపు దంచుకునే కార్యక్రమం జరిగింది. సాధారణంగా అంతా చేసుకునే హల్దీ ఫంక్షన్ కాద‌ని దాని స్థానంలో ఇంట్లోనే అంద‌రి స‌మ‌క్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సామాన్యుల‌ను సైతం ఆక‌ట్టుకుంది.

ఈ వేడుకలో అల్లు అర‌వింద్‌, పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా, అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహ, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, బంధువులు, పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Updated Date - Feb 13 , 2026 | 10:49 PM