అబ్బా.. అల్లు శిరీష్ భార్యలో ఈ టాలెంట్ కూడా ఉందా

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:52 PM

ఈ ఏడాది అల్లు వారి అబ్బాయి శిరీష్ (Allu Sirish) ఒక ఇంటివాడైన సంగతి తెల్సిందే. తానెంతో ప్రేమించిన నయనిక రెడ్డి(Nayanika Reddy)ని శిరీష్ వివాహమాడాడు.

Allu Sirish

ఈ ఏడాది అల్లు వారి అబ్బాయి శిరీష్ (Allu Sirish) ఒక ఇంటివాడైన సంగతి తెల్సిందే. తానెంతో ప్రేమించిన నయనిక రెడ్డి(Nayanika Reddy)ని శిరీష్ వివాహమాడాడు. పెళ్లి తరువాత శిరీష్ పలు ప్రాజెక్టులను వింటున్నాడని సమాచారం. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ఎన్నో విషయాలను పంచుకునే అల్లు శిరీష్ తాజాగా తన భార్యలోని టాలెంట్ ని చూసి ఆశ్చర్యపోయాడు. పెళ్లి తరువాత నయనిక చాలా ట్రోల్ కి గురైంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా వియర్డ్ గా ఉంటాయని కొందరు.. లుక్ వేరేలా ఉంటుందని కొందరు కామెంట్స్ చేయడం, ఆ కామెంట్స్ ని కూడా శిరీష్ పాజిటివ్ గా తీసుకొని రిప్లై ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.


ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా అల్లు శిరీష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ప్రత్యేకమైన పిక్‌ను షేర్ చేశాడు. ఒక ఆధ్యాత్మిక పూజా కార్యక్రమంలో నయనిక రెడ్డి కింద కూర్చుని ఎంతో భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ కనిపించింది. ఎల్లో కలర్ ట్రెడిషనల్ చీరలో నయనిక పద్ధతిగా పాటలు పాడుతుంటే.. వెనుక ఆమె అత్తగారు నిర్మల, తోటికోడలు స్నేహ, చిరంజీవి భార్య సురేఖ ఆ భక్తిలో లీనమైపోయారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ శిరీష్ అద్భుతమైన క్యాప్షన్ జోడించాడు. ఆమెలో ఈ కోణం కూడా ఉందా!అంటూ ఆశ్చర్యపోయాడు.


ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు, మెగా- అల్లు అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అల్లువారి కోడలిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ? మంచి విషయమే అని కొందరు అంటుండగా.. అల్లువారి కోడలు అంటే ఆ మాత్రం ఉండాలి అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Updated Date - Aug 01 , 2026 | 08:52 PM