సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘అల్లు సినిమాస్‌’ ప్రారంభం..

ABN , Publish Date - Mar 12 , 2026 | 08:02 PM

‘అల్లు సినిమాస్‌’ (Allu Cinemas) పేరుతో అల్లు అరవింద్ నెలకొల్పిన  భారీ మల్టీప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి (Revanth Reddy)రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

‘అల్లు సినిమాస్‌’ (Allu Cinemas) పేరుతో అల్లు అరవింద్ నెలకొల్పిన భారీ మల్టీప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి (Revanth Reddy) రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత నటుడు అల్లు రామలింగయ్య విగ్రహానికి నివాళులర్పించారు. కోకాపేటలో గురువారం సాయంత్రం ఈ వేడుక సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌ కలిగిన మల్టీప్లెక్స్‌ ఇది.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ '

'అల్లు సినిమాస్’ అల్లు కుటుంబానికి చక్కని ఎమోషన్. ఎంతో ఇష్టపడి  అరవింద్ దీనిని నిర్మించారు. హైద్రాబాద్ కి  దేశానికి అల్లు సినిమాస్ మంచి గుర్తింపు తీసుకురావాలి. భవిష్యత్ లో బన్నీ హాలీవుడ్ లో కూడా రాణించాలి. చాలా కాలంగా సినిమాలకు భాషా సరిహద్దులు తొలగిపోయాయి. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీకి  కావాలి.అవతార్, జురాసిక్ పార్క్ లాంటి చిత్రాలు మన దగ్గర కూడా రావాలి. హాలీవుడ్ కలెక్షన్లతో  పోటీపడేలా తెలుగు సినిమా ఉండాలి.  ప్రభుత్వం తరఫున సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తాం' అని అన్నారు. 

ఉగాది సందర్భంగా ఈ నెల 19 నుంచి ఈ మల్టీప్లెక్స్‌లో.. సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిసింది. ఇందులో నాలుగు స్క్రీన్లు ఉన్నాయి. అందులో స్క్రీన్‌ 1లో డాల్బీ విజన్‌ డిజైన్ చేసి ఉంది.  మార్చి 13 నుంచి ‘బుక్‌ మై షో’ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయనున్నట్లు ‘అల్లు సినిమాస్‌’ తెలిపింది. తొలుత ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, ‘ధురంధర్‌ 2’ సినిమాలను ప్రొజెక్ట్  చేయనున్నారు. 

Updated Date - Mar 12 , 2026 | 11:36 PM