అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ.. ఇదిగో క్లారిటీ

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:28 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పుష్ప 2 తరువాత తమిళ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రాకా (Raaka) సినిమా చేస్తున్నాడు.

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పుష్ప 2 తరువాత తమిళ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రాకా (Raaka) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక బన్నీ సినిమాల గురించి పక్కన పెడతే.. గత కొన్నిరోజులుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ మధ్యనే ముంబైలో ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో సీక్రెట్‌గా సమావేశమయ్యాడని, నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.


అయితే, ఈ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై అల్లు అర్జున్ అధికారిక బృందం తక్షణమే స్పందించింది. ప్రశాంత్ కిషోర్‌తో అల్లు అర్జున్ భేటీ అయ్యారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు స్పష్టం చేశారు. ఈ ప్రచారాలన్నీ కేవలం పుకార్లని, ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటూ బన్నీ టీమ్ కొట్టిపారేసింది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతానికి ఆయనకు లేదని తేల్చి చెప్పింది. నిజం చెప్పాలంటే.. బన్నీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆయనకు సపోర్ట్ ఇచ్చేవారు చాలామందే ఉన్నారు అనేది కొందరి వాదన. అల్లు అర్జున్ మామగారు ఇప్పటికే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకవేళ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా మామ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇటు పక్క మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ, రాజకీయాలు అంటే ఆషామాషీ విషయం కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటివారే ఈ రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి ఇబ్బందులు పడ్డారో బన్నీ దగ్గరనుంచి చూశాడు. అలాంటిది.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బన్నీ ఇలాంటి నిర్ణయం అస్సలు తీసుకొనే ఛాన్స్ లేదు. కచ్చితంగా ఇది ఫేక్ న్యూస్ అని ఫ్యాన్స్ కుండబద్దలు కొడుతున్నారు.


ఇక రాజకీయాల సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్ క్రేజ్ మాత్రం దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతోంది. ఆయన అఫీషియల్ టీమ్ పర్యవేక్షణలోనే భారతదేశం అంతటా బన్నీ ఫ్యాన్ నెట్‌వర్క్స్ భారీగా విస్తరిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్‌ను మరింత బలోపేతం చేసేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు రాకా సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో నిలబడాలని బన్నీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయో.. లేదో చూడాలి.

Updated Date - Jul 10 , 2026 | 05:29 PM