చిరు వర్సెస్ రజనీ.. మరింత అగ్గి రాజేసిన అల్లు అర్జున్
ABN , Publish Date - Oct 23 , 2026 | 03:23 PM
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డులు, స్టార్ హీరోల మధ్య జరిగే పోలికలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఇతర హీరోల సినిమాలను మెచ్చుకుంటూ స్టార్స్ పెట్టే చిన్న సోషల్ మీడియా పోస్టులు కూడా అనూహ్యమైన వివాదాలకు దారితీస్తుంటాయి.
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డులు, స్టార్ హీరోల మధ్య జరిగే పోలికలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఇతర హీరోల సినిమాలను మెచ్చుకుంటూ స్టార్స్ పెట్టే చిన్న సోషల్ మీడియా పోస్టులు కూడా అనూహ్యమైన వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టిన ఒక అప్రిసియేషన్ పోస్ట్ టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో పెద్ద రచ్చకు కారణమైంది. సూపర్ స్టార్ రజినీకాంత్(Allu Arjun) సినిమా సక్సెస్‌పై బన్నీ చేసిన ట్వీట్ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికావడం సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది.
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయ్యిన దగ్గరనుంచి చిరంజీవిని రజనీతో పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విషయం తెల్సిందే. వయస్సుకు తగ్గ పాత్రలు చేయడం అంటే ఇది అని, ఇంకా కుర్ర హీరోలా.. కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేయడం కాదని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఎక్స్ లో రజనీ వర్సెస్ చిరు నడుస్తుంటే.. దానికి బన్నీ తన ట్వీట్ తో ఆజ్యం పోశాడు.
జైలర్ 2 సంచలన విజయంపై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. 'చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఒక్క రజినీకే సాధ్యం' అంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే ఈ పోస్ట్ ఎంచుకున్న టైమింగ్ ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. ఈ సున్నితమైన, ఉద్రిక్త వాతావరణం మధ్యలో అల్లు అర్జున్ రజినీకాంత్‌ను ఆకాశానికెత్తుతూ పోస్ట్ పెట్టడం మెగా అభిమానులకు తీవ్ర అసహనాన్ని తెప్పించింది. ఇప్పటికే కొన్నేళ్లుగా మెగా - అల్లు కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెల్సిందే.
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నిలబడినప్పుడు కూడా బన్నీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటి నుంచి అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పుడిప్పుడే అన్ని సర్దుకుంటున్నాయి అన్న సమయంలో మరోసారి అల్లు అర్జున్ అగ్గి రగిల్చాడు. దీంతో మరోసారి మెగా ఫ్యాన్స్ .. ఐకాన్ స్టార్ పై విమర్శలు గుపిస్తున్నారు. చిరంజీవి లేకపోతే బన్నీకి ఈ ఇండస్ట్రీలో ఇంత గుర్తింపు వచ్చేదా? మూలాలు మరిచిపోయి ఇలా వ్యవహరించడం సరికాదు అంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. కేవలం బాక్సాఫీస్ నంబర్సే కాకుండా స్టార్డమ్, మార్కెట్ రీచ్ వంటి అంశాలను లాగుతూ నెట్టింట పెద్ద యుద్ధమే నడుస్తోంది.
సినిమా రంగంలో ఒక హీరో విజయాన్ని మరో హీరో అభినందించడం సాధారణ విషయమే అయినప్పటికీ, దాని వెనుక ఉండే టైమింగ్ , పరిస్థితులు ఎంతటి దుమారం రేపుతాయో ఈ ఘటనే నిదర్శనం. ఇద్దరు దిగ్గజ నటుల మధ్య అనవసరమైన పోలికలను తీసుకువచ్చి, అందులోకి అల్లు అర్జున్ పోస్ట్‌ను లాగి ట్రోల్ చేయడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఒక ప్రశంసతో ప్రారంభమైన ఈ సోషల్ మీడియా వార్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.