Allu Arjun: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. సూపర్ హీరో వస్తున్నాడు

ABN , Publish Date - Jan 20 , 2026 | 09:14 PM

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఓ వైపు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ అత్యంత భారీ వ్యయంతో రూపొందుతోంది.

Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఓ వైపు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ అత్యంత భారీ వ్యయంతో రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే , మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) సినిమాను కూడా బన్నీ అంగీకరించడం విశేషంగా మారింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే చిత్రం ఓ సూపర్ హీరో మూవీలా రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో హీరోకు ఓ చేయి ఐరన్ హ్యాండ్ లా ఉంటుందని సమాచారం. పట్టాలెక్కక ముందే అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ ఇంత విశేషంగా మారడంపై అప్పుడే టాలీవుడ్ లో చర్చ మొదలయ్యింది.

ఇటీవల రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన 'కూలీ' భారీ వసూళ్ళు చూసినా, పరాజయం పాలయ్యిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ తో ఏ స్టార్ హీరో మూవీకి అంగీకరిస్తారో అనుకుంటూ ఉండగా ఏకంగా స్టైలిష్ స్టార్ బన్నీని పట్టేశారు. లోకేశ్ గతంలో సూర్య కోసం రాసుకున్న స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ ను అప్రోచ్ అయ్యారు. లోకేశ్ సబ్జెక్ట్ నచ్చడంతో బన్నీ వెంటనే ఆ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఇప్పుడు సబ్జెక్ట్ కు మార్పులూ చేర్పులూ చేశారట లోకేశ్. ఈ చిత్రంలో హీరోకు యాక్సిడెంట్ లో ఓ చేయి కోల్పోతాడు. దానిని ఓ ఐరన్ హ్యాండ్ గా మార్చుకొని దుష్టులపై పోరాటం చేస్తూంటాడు హీరో అని సమాచారం.

గతంలోనూ పలు సూపర్ హీరోస్ మూవీస్ లో హీరోలు ఐరన్ హ్యాండ్స్ తో నటించిన దాఖలాలున్నాయి. అమితాబ్ బచ్చన్ 'షెహెన్ షా'లో అదే తీరున వ్యవహరిస్తూ కనిపించారు. ఇక 'ద మ్యాన్ విత్ ద ఐరన్ ఫిస్ట్స్' మూవీలోనూ హీరో రెండు చేతులూ ఐరన్ హ్యాండ్స్ గా ఉంటాయి. నెట్ ఫ్లిక్స్ లో 'ఐరన్ ఫిస్ట్' అనే సిరీస్ సక్సెస్ ఫుల్ గా సాగింది... మార్వెల్ కామిక్స్ లోనూ ఐరన్ ఫిస్ట్ పాత్ర కనిపిస్తుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో అలరించిన ఐరన్ ఫిస్ట్ రోల్ ను పోలిన పాత్రలోనే అల్లు అర్జున్ నటించబోవడం ప్రస్తుతం విశేషంగా మారింది. బన్నీ-అట్లీ మూవీ ఎలా ఉంటుందో? దాని తరువాత వచ్చే లోకేశ్ కనగరాజ్ సూపర్ హీరో సినిమా ఏ తీరున అలరిస్తుందో అని అప్పుడే ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ తన రాబోయే చిత్రాలతో ప్రేక్షకులకు వైవిధ్యం అందించే పనిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో బన్నీ ఫ్యాన్స్.. బాక్సాఫీస్ ఊపిరిపీల్చుకో.. సూపర్ హీరో వస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తూ.. ఏఐ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

Updated Date - Jan 20 , 2026 | 09:14 PM