Allu Arjun: అల్లు సినిమాస్.. మెగాస్టార్ హైలైట్ .. ఇది కదా కావాల్సింది
ABN , Publish Date - Jan 03 , 2026 | 09:49 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ఒకపక్క హీరోగా ఇంకోపక్క బిజినెస్ మ్యాన్ గా కెరీర్ కొనసాగిస్తున్న విషయం తెల్సిందే.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ఒకపక్క హీరోగా ఇంకోపక్క బిజినెస్ మ్యాన్ గా కెరీర్ కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా బన్నీ.. తన కుటుంబంతో కలిసి మల్టీఫెక్స్ రంగంలోకి దిగాడు. కోకాపేట లో అల్లు సినిమాస్ పేరుతో అతిపెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ ని నిర్మించారు. నేడు ఈ థియేటర్ ని ఫార్మల్ గా ఓపెన్ చేశారు. ఇక ఈ థియేటర్ కేవలం థియేటర్ గా మాత్రమే కాకుండా ఒక లగ్జరీ అనుభూతిని ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మల్టిఫ్లెక్స్ లో 75 అడుగుల భారీ స్క్రీన్, డాల్బీ విజన్ 3D లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
అయితే ఈ అల్లు సినిమాస్ లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి హైలైట్ గా నిలిచాడు. ధియేటర్ లోపల తన తాత అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్ ఫోటోస్ పక్కన మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఫోటోని కూడా వాల్ కి డిజైన్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో అల్లు ఫ్యాన్స్.. అది బన్నీ గ్రాటిట్యూడ్ అని చెప్పుకొస్తున్నారు.
గత కొంతకాలంగా అల్లు - మెగా కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. కానీ, ఇరు కుటుంబాలు ఎప్పుడు బయటపడలేదు. అంతకుముందులా ఈ రెండు కుటుంబాలు పండగ సమయంలో కూడా కలవడం లేదు. ఎవరికి వారు విడిగా ఉంటున్నారు. దానికి కారణం బన్నీ అని, అతను పవన్ కి సపోర్ట్ చేయకపోవడంతోనే వీరి మధ్య గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఇంకోపక్క బన్నీ చాలాసార్లు తనకు తానుగా ఎదిగానని చెప్పడంతో.. మెగాస్టార్ ను పట్టుకొని వచ్చిన కొమ్మ అల్లు అర్జున్.. ఇప్పుడు ఒక స్టార్ అయ్యాకా రూట్స్ ని మర్చిపోయాడు అని కామెంట్స్ చేశారు. అయితే బన్నీ తన రూట్స్ ఎప్పటికీ మర్చిపోడు అని.. తాత, తండ్రి తరువాత ఎప్పటికీ బన్నీ మనసులో చిరు ఉంటాడని చెప్పుకొస్తున్నారు. దీంతో మెగా - అల్లు ఫ్యాన్స్ మళ్లీ కలిసిపోతారేమో చూడాలి.