Sandhya Theater stampede: కోర్ట్ లో హాజరు కాలేదు.. అదే కారణం
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:08 PM
'పుష్ప 2' ప్రీమియర్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ
'పుష్ప 2' ప్రీమియర్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురు కోర్టు ముందు హాజరు కాగా, హీరో అల్లు అర్జున్ (Allu Arjun) వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను జులై 6వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను A11 నిందితుడిగా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా బన్నీ కోర్టు ముందు హాజరు కావాలని శనివారం సమన్లు జారీ చేశారు. అయితే అల్లు అర్జున్ గైర్హాజరుకు గల కారణాలను న్యాయస్థానానికి ఆయన తరఫు న్యాయవాది వివరించారు.
A1 నుంచి A10 వరకు నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని చేర్చగా, మొత్తం 23 మందిపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఈ ఘటన 2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.