పారితోషికం అంతా పర్సంటేజ్‌ పద్దతిలోనే..

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:51 PM

‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌ పాన్‌ ఇండియాను దాటిపోయింది. పారితోషికం విషయంలోనూ ఆయన పేరు టాప్‌ రేసులో ఉంది. ఈ విషయంలో అల్లు అర్జున్‌ కొత్త ట్రెండ్‌ను సృష్టించారని టాక్‌.


‘పుష్ప’ (Pushpa) చిత్రంతో అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌ పాన్‌ ఇండియాను దాటిపోయింది. పారితోషికం విషయంలోనూ ఆయన పేరు టాప్‌ రేసులో ఉంది. ఈ విషయంలో అల్లు అర్జున్‌ (Allu arjun) కొత్త ట్రెండ్‌ను సృష్టించారని టాక్‌.  ‘పుష్ప 2: ది రూల్‌’ నుంచే అల్లు రెమ్యునరేషన్‌ పర్సంటేజ్‌ విధానంలో (Percentage model0 తీసుకుంటున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఈ సినిమా బిజినెస్‌ మొత్తంపై 27 శాతం పారితోషికంగా తీసుకున్నారని చాలా కాలంగా టాక్‌ నడుస్తోంది. సినిమా దాదాపు రూ.1000 కోట్ల బిజినెస్‌ టచ్‌ చేయడంతో అల్లు అర్జున్‌ అందులో 27 శాతం లెక్కన రూ.270 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని గుసగుసలు వినిపించాయి. అయితే అట్లీ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి ఇదే పద్దతి ఫాలో అవుతున్నారట. ఈసారి కాస్త పారితోషికం పెరిగిందట.

సినిమా బిజినెస్‌పై 27 నుంచి 30 శాతం వరకు పారితోషికంగా ఇవ్వడానికి సన్‌ పిక్చర్స్‌ అంగీకరించినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటిని అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు పర్యవేక్షణలో జరుగుతున్నాయని తెలిసింది. భారీ పారితోషికం తీసుకోవడం, రిలీజ్‌ తర్వాత లాభాల్లో షేర్‌ కోరడం కాకుండా మొత్తం బిజినెస్‌పై పర్సంటేజ్‌ విధానంలో పారితోషికం తీసుకోవడంతో అల్లు అర్జున్‌ భారతీయ సినీ పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్‌ తీసుకొచ్చారిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - Feb 07 , 2026 | 01:52 PM