సీక్రెట్ గా పవన్ కళ్యాణ్ ని కలిసిన అల్లు అర్జున్..
ABN , Publish Date - Jun 10 , 2026 | 08:41 PM
గత కొంతకాలంగా మెగా- అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల సమయం నుండి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానుల మధ్య ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది.
గత కొంతకాలంగా మెగా- అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల సమయం నుండి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానుల మధ్య ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. అంతేకాకుండా మెగా ఇంటి వేడుకల్లో బన్నీ కనిపించడమే మానేశాడు.దీంతో వీరిద్దరి మధ్యన ఇంకా విభేదాలు అలాగే కొనసాగుతున్నాయని టాక్ నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక సంచలన వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సీక్రెట్‌గా కలిశారనే ప్రచారం జోరందుకుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఈ మధ్యనే సర్జరీ జరిగిన విషయం తెల్సిందే. కొన్నిరోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న పవన్ .. ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. బన్నీ, ఎవరికీ తెలియకుండా పవన్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడంతోపాటు కుటుంబ విషయాల గురించి కూడా చర్చించారట. సాధారణంగా అన్నింటిలో పబ్లిసిటీ కోరుకొనే బన్నీ.. పవన్ ఇంటికి ఇలా సీక్రెట్ గా వెళ్ళడం వెనుక కారణం.. ఈ విషయాన్ని పబ్లిసిటీ చేయాలని బన్నీ కోరుకోలేదట. అందుకే ఫోటోలు కూడా తీయలేదని టాక్. అందుకే ఈ భేటీకి సంబంధించి అల్లు అర్జున్ టీమ్ నుండి కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వర్గాల నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈమధ్య అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడుతున్నాడు. పవన్ ని కలవడమే కాకుండా.. పెద్ది సినిమాపై పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. పెద్ది సినిమాపై జరుగుతోన్న నెగిటివిటీని పక్కన పెట్టి చరణ్ నటనను అభినందిస్తూ బన్నీ ట్వీట్ వేయడం, దానికి చరణ్ థాంక్స్ చెప్పడం లాంటివి చూస్తుంటే.. మళ్ళీ బన్నీ మెగా ఫ్యామిలీకి దగ్గర అవుతున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఏదిఏమైనా వారందరూ ఎప్పుడూ ఒకే కుటుంబం. ఎప్పటికీ వారు కలిసేఉంటారు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
భారతీరాజా అంత్యక్రియల్లో తీవ్ర కలకలం.. బంధువులపై సింగర్ ఆగ్రహం
కన్నీళ్ళు పెట్టిస్తోన్న భారతీరాజా చివరి వీడియో..
Drishyam 3: అందుకే.. వెంకటేశ్‌తో దృశ్యం 3 రీమేక్ చేయలేదు! అసలు గుట్టు.. బయట పెట్టిన డైరెక్టర్