అల్లు అర్జున్ గొప్ప మనసు.. నటికి సహాయం
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:55 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తోన్న లేడీ కమెడియన్ కి ఆయన ఆపన్న హస్తం అందించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తోన్న లేడీ కమెడియన్ కి ఆయన ఆపన్న హస్తం అందించారు. గత కొంతకాలంగా నటి పావలా శ్యామల (Pavala Syamala) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఎప్పటి నుంచో ఆమె తన ఆరోగ్య పరిస్థితి బాలేదని, ఇండస్ట్రీ పెద్దలు ఆదుకోవాలని అర్థిస్తూ వచ్చారు. చిరంజీవి, సాయి దుర్గా తేజ్, ఆకాష్ పూరి, కాదంబరి కిరణ్ లాంటి నటులు.. పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేస్తూ వచ్చారు. కానీ, పావలా శ్యామల, ఆమె కుమార్తె మందులకు అవి సరిపోలేదు.
ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉండడంతో ఈ తల్లీకూతుళ్లను సికిందరాబాద్ కార్ఖానా లోని ఆర్కే ఫౌండేషన్ లో చేర్పించారు. అక్కడ కూడా వారికి మందులకు ఎక్కువ ఖర్చు అవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం తెలుసుకొన్న అల్లు అర్జున్.. పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ప్రతినెలా వారికి పదివేలు అందేలా ఏర్పాటు చేశారు.
అల్లు అర్జున్ సిబ్బంది.. పావలా శ్యామలను పరామర్శించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త తెలుసుకొన్న అల్లు ఫ్యాన్స్.. బన్నీ గొప్ప మనసును ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ.. అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది కాకుండా మలయాళ నటుడు, దర్శకుడు అయిన బాసిల్ జోసెఫ్ తో శక్తిమాన్ లాంటి సూపర్ హీరో కథ చేయబోతున్నారని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.