ఆ రూల్.. పాటిస్తేనే సినిమా! అల్లు అర్జున్.. హుకూం

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:50 PM

ప్ర‌స్తుతం రాకా చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.

Allu Arjun

కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా లెవల్లో పుష్ప మేనరిజంతో ఊపేసిన హీరో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun). అయితే, పుష్ప-2 (Pushpa: The Rise) తర్వాత బన్నీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. తనతో సినిమా చేయాలంటే ఇకపై ఆ రూల్ కచ్చితంగా పాటించాల్సిందేనట. మరి ఆ కొత్త రూల్ ఏంటి? అది ఎవరి కోసం?.

పుష్ప: ద రైజ్ చిత్రంతో నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, నార్త్ ఇండియాలో సైతం తిరుగులేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే పుష్ప సిరీస్ కోసం బన్నీ దాదాపు ఐదేళ్ల సమయాన్ని కేటాయించారు. ఒకే క్యారెక్టర్ మీద ఇన్నేళ్లు వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న రాక (Raaka ) చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 800 కోట్ల బడ్జెట్, హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ప్లాన్ చేస్తున్నారు. పుష్ప కోసం ఐదేళ్లు, ఇప్పుడు అట్లీ సినిమా కోసం మరో రెండేళ్లు.. ఇలా ఒక్కో ప్రాజెక్టుకు ఏళ్ల కాలం పడుతుండటంతో బన్నీ ఒక స్ట్రాంగ్ డెసిషన్‌కు వచ్చారని సమాచారం.

ఇకపై తను నటించే ఏ సినిమా అయినా, తన పార్ట్ షూటింగ్ కేవలం 200 రోజుల్లోనే పూర్తి కావాలని దర్శక నిర్మాతలకు హుకుం జారీ చేశారట. ఎంత పెద్ద సినిమా అయినా, ఎన్ని గ్రాఫిక్స్ ఉన్నా.. తన షూటింగ్ షెడ్యూల్ మాత్రం ఆ 200 రోజుల గడువు దాటకూడదని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. బన్నీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం తన అభిమానులే. పుష్ప-2 వచ్చి ఏడాదిన్నర అవుతున్నా, నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. అందుకే, ఇకపై ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా అయినా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకోవాలని బన్నీ ఫిక్స్ అయ్యారట. తద్వారా ఫ్యాన్స్‌ను అలరించడమే కాకుండా, పాన్ ఇండియా మార్కెట్‌లో తన క్రేజ్ తగ్గకుండా కాపాడుకోవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇది కచ్చితంగా బన్నీ కెరీర్‌కు ప్లస్ అయ్యే విషయమే.

గతంలో కూడా బన్నీ గురించి ఇలాంటి కొన్ని రూమర్స్ వచ్చాయి. బన్నీని కలవాలంటే 40 రూల్స్ పాటించాలని, అప్పుడే ఆయన విలువ ఇస్తారని కొందరు నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ తర్వాత అవన్నీ అబద్ధాలని తేలిపోయాయి. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న ఈ 200 రోజుల రూల్ మాత్రం కేవలం సినిమా వేగం పెంచడానికి తీసుకున్న ప్రొఫెషనల్ నిర్ణయం అని సమాచారం. ఇక ప్రస్తుతం బన్నీ అట్లీ ప్రాజెక్ట్‌తో పాటు, త్వరలో లోకేష్ కనక‌రాజ్‌ దర్శకత్వంలో ఒక మూవీతో పాటు, మలయాళ డైరెక్టర్‌ బాసిల్‌ జోసెఫ్‌ దర్వకత్వంలోనూ మూవీ చేయనున్నారట. టాలీవుడ్‌ దర్శకులతో కాకుండా ఇలా క్రేజ్‌ ఉన్న పక్క ఇండస్ట్రీ దర్శకులతో సినిమా చేయడం వల్ల అక్కడి మార్కెట్‌ కలిసొస్తుందని బన్నీ అభిప్రాయం.

Updated Date - Apr 28 , 2026 | 08:12 PM