శిరీష్ పెళ్లి.. అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:28 AM
అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. నయనికతో అల్లు శిరీష్ (Allu Sirish) వివాహం మార్చి 6న జరగనుంది.
అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. నయనికతో అల్లు శిరీష్ (Allu Sirish) వివాహం జరగనుంది. మార్చి 6న మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒకటి కానున్నారు. పసుపు కొట్టడం, ఆహ్వాన పత్రికలు పంచడం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) తన నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు.

ఈ పార్టీకి రామ్ చరణ్, ఉపాసన దంపతులతోపాటు దేవిశ్రీ ప్రసాద్, సందీప్ కిషన్, సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారం రోజుల క్రితం గోవాలో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. తాజాగా కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.